Dhanurmasam30-12-2024
*సమీక్షా సారాంశం*
*మహతి సాహితీ కవిసంగమం కవి మిత్రులు అందరికీ యశోదమ్మ నమస్సులు. ధనుర్మాస కవితోత్సవం 2024.. ఈనాటి కార్యక్రమానికి మూడు విధాలైన ప్రక్రియలలో తమ అమూల్యమైన రచనలను పంచుకున్న కవి మిత్రులు అందరికీ ధన్యవాదములు మరియు అభినందనలు. ఈనాటి రచనలలో... వచన కవితలు... పద్యాలు... ఇష్టపదులు.. చోటు చేసుకున్నాయి. దాదాపు పక్షం రోజులకు చేరుకున్నాము. పాశురాలను ఇష్టపదులుగా వచన కవితలుగా కవి మిత్రులు చాలామంది రాస్తున్నారు. తొలినాటితో పోల్చితే కవిత్వీకరణ కాస్త మెరుగుపడింది. ఇష్టపదులు సత్యంగారు సూచించిన సూచనలను అనుసరించి సరిచేసుకో గలరు. ఇక పద్య కవులు గురుమూర్తి గారి సూచనలను స్వీకరించగలరు. సమీక్షణం యొక్క ప్రధాన ఉద్దేశ్యం మెరుగైన కవితల ఉత్పాదన మాత్రమే తప్ప వేరే ఎవరినీ నొప్పించేది మాత్రం కాదని గమనించగలరు. నేడు నాకు ఈ సమీక్షణం చేసే అవకాశాన్ని ఇచ్చిన అధ్యక్షుల వారికి... నేటి నిర్వాహకుడు చి. చందుకు సహనిర్వాహకులకు.. సహ సమీక్షకులకు.. కవిమిత్రులందరికీ ధన్యవాదములు. తిరిగి రేపు ఉదయం చక్కని రచనలతో మరల కలుద్దాం. అంతవరకు సెలవు శుభరాత్రి*
*మీ*
*మహతీ యశోదమ్మ*
*శ్రీమతి వరలక్ష్మి యనమండ్ర*
🙏💐🙏💐🙏
[30/12, 7:44 AM] +91 84838 78838: మహతీ సాహితీ కవి సంగమం.
ధనుర్మాస కవితోత్సవం 2024.
అంశం :ఐఛ్ఛికము
శీర్షిక: చిరస్మరణీయులు
తేది:30-12-24.
వారం: సోమవారం.
పేరు: రాధా సురేష్ యర్జల్.
ఊరు: పూణె ( మహారాష్ట్ర)
ప్రక్రియ: వచన కవిత
ఈవారం కవితా సంఖ్య 1️⃣3️⃣
మహతీ సాహితీ కవి సంఖ్య 4️⃣
బలిదానాల ప్రతి ఫలం మన దేశం.
మన భారత దేశ స్వాతంత్ర్యం కోసం తమ తమ.... జీవితాల్ని బలి చేసిరి త్యాగధనులు...
భవిష్యత్ తరాలు తలుచుకునే చిరస్మరణీయులు.
ఎందరో మహానుభావులు..
ఉక్కు సంకెళ్ళ ను ముద్దాడి..
ఉరి కొయ్య లకు గురి అయిన...
అమర వీరుల త్యాగం అమరం..
ధైర్యానికి నిలువెత్తు రూపం.
జీవితాలను త్యాగం చేసిన...
మీ దేశ భక్తి కి ఘన నివాళి.
విదేశీ సొత్తు కాదు రా మన దేశం
అంటూ గుండె ల నిండుగా దేశభక్తిని నింపుకున్న..
అమర వీరులకు..మీ ధైర్య సాహసాలకు.. భారతావని..
మన భరతమాత ముద్దుబిడ్డ లుగా మిమ్మల్ని...
ఎప్పటికీ మర్చిపోలేము.
మీ త్యాగానికి మనోభావాలకు
జైహింద్. నా దేశం పుణ్య చరిత.తెలుసుకో రాధమ్మ.
హామీ పత్రం: ఈరోజు నేను రాసిన కవిత నా స్వీయ రచన. కేవలం ధనుర్మాస కవితోత్సవం కోసమే రాసానని ప్రమాణ పూర్వకముగా హామీ ఇస్తున్నాను.
[30/12, 7:46 AM] Kadali Prakash Rao Prakash: మహాతీ సాహితీ కవిసంగమం
ధనుర్మాసకవితోత్సవం
2024.
పాశురము - 15
తే. 30-12-2024ది
తిరుప్పావై
శీర్షిక :గోదాదేవి దీక్షా వ్రతం
కవితాసంఖ్య : 15
ప్రక్రియ : ఇష్టపది -15
కవిపేరు : డాక్టర్. కడలి ప్రకాశరావు
కవిసంఖ్య : 8
ఇష్టపది
*******
కృష్ణ తత్త్వము నీకు
కృపతోడయబ్బినది
నీమాట చతురతకు
నిమ్మకుండి పోతిమి
ప్రహ్లాదరక్షణము
ప్రశంస నీయమూ
నీనాథుడే యిలను
నిఖిల జనావళికిని
శ్రీరంగ నాధుడిగా
శ్రీకరంబైనాడూ
కరిరాజును రక్షించె
కారుణ్యవదనుడే
వాణీ నామనసున
వర్ణింతు భక్తితో
కడలి వారి మాటలు
కల్లకాదెన్నడును!!!
హామీ పత్రం :ఇదినా స్వీయ రచన యని హామీ ఇస్తున్నాను.
[30/12, 7:50 AM] +91 88850 50822: మహతీ సాహితీ కవిసంగమం
ధనుర్మాస కవితోత్సవం-2024
అంశము: ఐచ్ఛికం – స్వాతంత్ర్య సమరయోధులు
ధ.క. కవితా సంఖ్య: 15
తేదీ: 30-12-2024
వారం: సోమవారం
శీర్షిక: ద్వారబంధనాల చంద్రయ్య దొర లేదా నాయుడు
కవిపేరు: యేచన్ చంద్ర శేఖర్
కవి సంఖ్య: 16
ప్రక్రియ: వచనం
అల్లూరి సీతారామరాజు కన్నా ముందే విప్లవ వీరుడు
ద్వారబంధాల రామచంద్రయ్య దొర లేదా నాయుడు
తెలుగు గడ్డ మీద పుట్టిన ఎందరో మేరు నగధీరులు
బ్రిటిష్ దాస్య శృంఖలాల విముక్తికై పోరాడిన వీరులు
బురదకోట స్థావరంగా చేపట్టారు విప్లవ తిరుగుబాటు
దీనికి బ్రిటిష్ పెట్టిన పేరే “రాంప పితూరీ తిరుగుబాటు”
పోలీసుస్టేషన్ నుండి ఆయుధాలను లోబర్చుకున్నాడు
గిరిజనులను ఇబ్బందిపెట్టే సైనికుల తలలు తెగనరికాడు
గిరిజనుల ప్రయోజనాలకు అందించాడు వెన్నుదన్ను
వారికోసం ప్రాణాలను త్యజించడంలో చూపలేదు వెన్ను
అట్టి స్వాతంత్ర్య సమరయోధుల చరితను వెలికిదీసి
అంజలి ఘటించ సంకల్పించినాడు చంద్రశేఖరుడు
హామీపత్రము: ఇది నా స్వీయ రచన అని ధృవపరుస్తున్నాను
[30/12, 7:57 AM] BSN RAO: మహతీ సాహితీ కవిసంగమం!
ధనుర్మాస కవితోత్సవం-2024.
తేది: 30.12.2024.
శీర్షిక: ఆండాళ్ తిరువడిగళే శరణం!
కవిత సంఖ్య: 15.
కవి: బాచిరాజు సత్యనారాయణ రావు,
(బా. స.రా)(9)
ప్రక్రియ: వచన కవిత.
******************************
ఏమీ! చిలకమ్మా నీవింకా నిద్ర లేవలేదా?
అవ్వా! చెప్పుకుంటే సిగ్గు,ఇంత ఆలస్యమా!
అబ్బా! చెలులారా,ఎంత కంగారు మీకు!
ఇదుగో ఒక్క క్షణం, వస్తున్నానే!
చాలు చాలు వేగిర రావమ్మా
లేచిలుకా!
ఏమిటి ఆ గావు కేకలు నా చెవులు చిల్లులు పడుతున్నాయి! వస్తున్నానని చెపుతుంటే ఓ తట్టు!
నీ చమత్కారం నీ జాణతనం మాకు తెలుసులే!
ఎంత కటీ బిటీగా మాట్లాడగలవో ఎరుగమా ఏమిటి!
ఆ మాటే వద్దంటున్నా, మీ గుణాలు నాకు అంటగట్ట కండి,దానికి మీరే సరిపోతారు!
సరే నేనట్టి దాననే అందరూ వచ్చినట్లేనా?
వచ్చారమ్మా తల్లీ! లెక్కపెట్టుకో వచ్చి!
అయినా,నేనేమీ చేయాలి వచ్చి ఇప్పుడు!
కృష్ణయ్య కువలయ పీడనం అను ఏనుగును
చంపాడా,
కంస రాజును సహరించి వచ్చాడా,అతడి
గుణ గణాలు మాతో కలిసి నీవూ కీర్తించాలి
తెమిలి రావమ్మా గోపికా!
ఇదిగో మేము సిద్ధంగా వున్నాము,నీవూ వచ్చి
మాతోకలిస్తే అందరం కలిసి వ్రతం పూర్తి చేయాలి.
అప్పుడే ఫలితం దక్కుతుంది మనందరికీ!
ఇతి శ్రీ తిరుప్పావై పంచదశ పాశుర ప్రార్థన శ్రీ గోదాదేవి విరచిత గానామృతం సర్వం శ్రీ రంగనాథ కృపా కటాక్షం!
ఈ పాశుర కవిత నా స్వీయ రచన.
[30/12, 8:56 AM] Ratna Lakshmi: మహతీ సాహితీ కవిసంగమం
ధనుర్మాస కవితోత్సవం-2024
తేదీ: 30-12-2024
శీర్షిక: *కడుపు కోత*
కవిత సంఖ్య: 6
కవి పేరు: ఎస్. రత్నలక్ష్మి
ప్రక్రియ: వచన కవిత
కవి సంఖ్య: 62
~~~~~~~~~~~~~~~
జననికీ జన్మభూమికీ పెనుభారమై
జగతి ప్రగతి పురోగతికి అవరోధమై
ఉన్మాద చర్యలకు అచ్చంగా ఆలవాలమై
ఉగ్రవాద భావజాలానికి ఆకారమై
మానవత్వానికి మాసిపోని మచ్చయై
మదోన్మాదంతో చెలరేగే తుచ్చయై
*కాటికెళ్ళే వరకు కలిగుంటే ఇలాంటి చెడునడత*
*కడకు కన్నవారికి మిగులుతుంది కడుపుకోత* .
భరత ధాత్రికీ మాతృమూర్తికీ కనురెప్పై
భరతమాత సేవలో తరించే ముత్యపుచిప్పై
నీతికీ నిజాయితీకి మరో రూపంగా నిలిచే చండ్రనిప్పై
నిర్భీతితో శత్రువుల్ని మట్టుపెట్టే పెనుముప్పై
ప్రకృతి ప్రమాదాల నుండి కాపాడే ఇంటికప్పై
ప్రతి ఒక్కరినీ మనోరంజింపజేసే పూలతెప్పై
దేశ రక్షణకే అంకితమైన దేశభక్తి పరాయణుడై
దేశమంతా కీర్తింపబడే సుగుణాభి రాముడై
*చరించేవారు ధరణిపై నిలుపును ఘనత*
*అలాంటి సంతతుంటే మాతృమూర్తికి కలగదెన్నడు కడుపుకోత*
ఎస్. రత్నలక్ష్మి
అసిస్టెంట్ ఇంజనీర్
నంద్యాల
ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను.
[30/12, 9:06 AM] T R K KAMESWARA RAO: మహతీ సాహితీ కవిసంగమం
ధనుర్మాస కవితోత్సవం-2024
తేదీ: 30-12-2024
శీర్షిక: తిరుప్పావై పాశురం - 15
(లేత చిలుక కంఠం దానా)
కవిత సంఖ్య: 15
కవిపేరు: తెలికిచెర్ల రాజ కృష్ణ కామేశ్వర రావు
కవి సంఖ్య: 6
ప్రక్రియ: వచనం
---------------------------------------
నిద్ర లేపి సన్నిద్దుల చేయు చుండె ఆండాళ్ తల్లి
ఒక్కొక్క గోపికను ఒక్కొక్క రీతి నారాయణ వ్రతముకై
లేపుటకు వచ్చె పదవ గోపిక కడకు
నిద్రించు ఆ గోపికతో
ఓ లేత చిలుక కంఠము వంటి కంఠము కల చక్కనిదానా!
లేవమ్మా తొందరగా మొద్దు నిద్ర మాని
అందరము వచ్చితిమి నీ దగ్గరకు
వచ్చి చూడమ్మా శత్రువులను,
కువలయపీడము మదపుటేనుగును సంహరించిన వాడు
చాణూర ముష్టికలగు యోధులను సంహరించిన వాడైన కృష్ణుని గుణ గణాలను గానం చేద్దాం
మనిషికి సహనం, ఓరిమి కలగడం చాలా కష్టం
ఉద్రేకం రావడం అనేది అతిసహజం
దాన్ని ఓరిమితో సహించడం మానవ ప్రయత్నంతోనే సంభవం
సాధన అంటే ఇదే
భాగవత సహవాసం వల్లనే ఇది ఏర్పడు
అలా ఏర్పడితేనే ఆచార్య కటాక్షం యోగ్యత ఏర్పడు
అప్పుడే మంత్రాను సంధానం చేసే స్థితి లభించినట్లు
ఆచార్య సన్నిదానానికి చేరే ముందర స్థితి ఇదే
ఎట్లాంటి భాగవతోత్తముల సహవాసం మనకు కావాలో ఆండాళ్ తల్లి ఈ రోజు చెబుతుంది.
అటువంటి భాగవతోత్తముడు శ్రీ కృష్ణ భగవానుడే
కాన, ఓ చెలులారా! శ్రీఘ్రముగా రండు
అందరమూ కలసి యా కృష్ణుని స్తుతించి గానము చేస్తూ
నిర్వర్తించుదాం ఆ నారాయణ వ్రతమును శ్రద్ధగా, అదిదయే మనకు రక్ష
"సులభ మార్గ మిదియే గోవిందుని సన్నిధి చేర!"
హామీ పత్రము: ఇది నా స్వీయ రచన
[30/12, 9:36 AM] Bhargavi Peri: మహతీ సాహితీ కవి సంగమం.
ప్రతిరోజూ కవితా పండగే.
తేదీ : 30-12-24, సోమవారం.
కవిత సంఖ్య : 15.
క్రమ సంఖ్య : 47.
పేరు : పేరి . భార్గవి.
ఊరు : విశాఖపట్నం.
15.
చిన్నారీ! యికవీడు మొద్దు నిదురన్ చింతల్నివారించు నా
పున్నాగాగ్రము నందునున్న నతనిన్ పొందంగ వేవేగమే
నిన్నేపొందగజూచువాని కడ వన్నెల్ చూపుమో కన్య సం
పన్నంబౌనిక నీదు నోములు మదిన్ ప్రార్థించ శ్రీ రంగనిన్.
[30/12, 9:41 AM] vtr Mohanrao: మహతీ సాహితీ కవిసంగమం
ధనుర్మాస కవితోత్సవం-2024
తేదీ: 30-12-2024
శీర్షిక: తిరుప్పావై పాశురము-15
ప్రక్రియ: వచన కవిత
కవిత సంఖ్య: 15
కవిపేరు: వి.టి.ఆర్.మోహనరావు
కవి సంఖ్య: 26.
----------------------------
చిన్నారి ఓ చిట్టి పలుకుల చిలకమ్మా
మొద్దు నిద్ర ఇంక ఎంత సేపమ్మా
నా నిద్రను మీరు పాడు చేయకండమ్మా
కాసేపు నన్నింకా నిద్ర పోనీయండమ్మా
తెల్లవారెను తల్లీ కళ్ళు తెరువమ్మా
వెళ్ళండి మీరు మీ వెనుకే నేను వస్తానమ్మా
మాటకారివి నీవు నిన్నెలా నమ్మేదియమ్మా
నీ మాటల మర్మం మాకు తెలియునమ్మా
మంచివారట మీరు నను విడువడమ్మా
నన్ను విడిచి కాస్త మీరు వెళ్ళరాదమ్మా
ఇంతకూ అందరూ వచ్చారాయమ్మా
లెక్కించుకోయమ్మ అందరొచ్చారుయమ్మా
ఒక్కసారి బయటకు వచ్చి చూడమ్మా
సరే! నేను వచ్చి ఏమి చేయవలెనమ్మా!
మదించిన మదపుటేనుగులనూ
శత్రువులనూ సంహరించినవాడు
శత్రువులలోని దుర్గుణాలను సంహరించెడి
ఆ మాధవుని గుణగణాలు కీర్తించుచూ
అందరం కల్సి ఈ వ్రతమాచరించుదాం రండి
అపరిమిత ఆనందం పొందుదాం రారండి
----------------------------
హామీపత్రము: పై వచన కవిత నా స్వీయ రచనని హామీ ఇస్తున్నాను.
[30/12, 10:40 AM] Dr M Ahalya Devi: మహతీ సాహితీ కవి సంగమం
ధనుర్మాస కవితోత్సవం-2024
30/12/2024
శీర్షిక;జ్ఞాన సుధ
డా.మరుదాడు అహల్యా దేవి
బెంగుళూరు
జాబితా సంఖ్య:7
కవితా సంఖ్య:15
ప్రక్రియ:వచన కవిత
నక్షత్రమండలంలో సగం మనుష్యుడు, సగం అశ్వంగా ధనుర్థరాకృతిలో కనపడేది ధనుస్సు రాశి కదా .
ఎప్పటికి స్మృతిపథంలో నిలిచిపోయే
ఆకర్షణీయమైన రాశి నీది..
నేత్రాలు ఆకర్షకంగా,సుందరమైన శరీరంతో ఉండే నిన్ను మరీమరీ చూడాలన్పించడం సహజమే..
నీ వాక్చాతుర్యం మనసుపై చెరగని ముద్ర వేస్తుందంటే కాదు అతిశయోక్తి..
వినేకొద్దీ వినాలనిపించే నీవాణి మధురాతి మధురం..
ధనుస్సు రాశి ఐనందువల్ల కాబోలు మాట స్పష్టంగా, బాణంలా వేగవంతమై ఉంటుంది..
బుద్ది కుశలత,సమయానికి తగిన నిర్ణయాలు తీసుకోవడం అద్భుతం,అమోఘం.
ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపే నీ నేర్పరితనానికి ముచ్చటేస్తుంది మిత్రమా..
లక్ష్యసాధనలో నీ ఏకాగ్రత, పట్టుదల చూడాల్సిందే కానీ వర్ణించడం కష్టమే.
వెడల్పయిన ముఖం,పెద్ద చెవులు,లావైన పెదవులు, మళ్ళీ మళ్ళీ వీక్షించాలన్పించే లావణ్యం..
పొడవైన మెడ, బలమైన దేహం,సాధు స్వభావం,శాంతి ప్రియత్వం అదనపు ఆకర్షణలే నీకు..
ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా చలించవు కొంచెం కూడా నువ్వు స్త్రీవైతే...
దారిద్య్రం,లేమి ఉన్నప్పటికీ చిరునవ్వు ప్రతిఫలిస్తుంటుంది నీ అధరాలపై..
సహాయశీలివి,దయాళువు, చేసిన మైత్రిని వదలడానికి ఇష్టపడవు.
విపత్కాలంలో మిత్రులకు సాయపడటం అనే నీలోని సద్గుణం మెచ్చుకోదగ్గది.
ఔదార్యం,బుద్ది కుశలత, సరళత్వం, ఉత్సాహంవంటి శ్రేష్ఠగుణాలన్నీ ఉన్నాయి నీలోనే..
ప్రతి రంగంలో నైపుణ్యమే నీకు ఎలా వచ్చిందోయ్ ఇంతటి తెలివితేటలు..
ఎంత సంపాదించినా జ్ఞానం ఇంకా సంపాదించాలనే ఆకాంక్ష ఎక్కువే నీకు.
సుఖభోగాలు అనుభవిస్తావు, ఉత్సాహంగా ఉంటావు,నిర్భయంగా తిరుగుతావు..
ఏ కార్యమైనా పూర్ణవిశ్వాసంతో చేస్తావు,అవును మరి నీపై నీకున్న నమ్మకం అలాంటిది...!!
స్వీయ రచన
మిత్రవింద
[30/12, 10:59 AM] M Satya Veena: మహతి సాహితీ కవి సంగమం
ధనుర్మాస కవితోత్సవం:2024
30/12/2024 సోమవారం
ధనుర్మాస కవితా సంఖ్య: 14
ధనుర్మాస కవి సంఖ్య: 2
అంశం: ఐచ్చికం
శీర్షిక: అపురూప పాశురాలు
ఆండాళ్ రచించిన పాశురాలు
అనన్య అసామాన్య గీతికలు
భక్తులందరికీ భావగీతాలు
భగవానుడి ఆనంద నివాళులు
కొలనులో ఎర్ర తామరలు వికసించే వేళ నల్ల కలువలు
మ ముడుచుకుపోతున్నవి..
చక్కని భావపరంపర
తెల్లవారిందని చెప్పుటక
అందమైన భావజాలం
ఆండాళ్ పాశురవిశిష్టత
మువ్వగోపాలుని రవళి సవ్వడి...
శంఖము చక్రము ధరించిన ఆ జానుబాహుడైన పుండరీ కాక్షుని గానము చేయుట
మదిలో మహాఉల్లాసం...
ఆ లీలా మానస చోరుడు
భక్తులను బ్రోచే మంగళ స్వరూపుడు... కోరిన కోరికలు తీర్చే నందగోపాలుడు... ముప్పది పాశురములతో
ముచ్చటగా మురిపెం తో
కొలిచిన గోదాదేవి శ్రీరంగనాధుడే ఆగోప బాలుడు
అవతార పురుషుడు.. మానవ రూపం దాల్చి అవనిలో పుట్టినభగవత్ స్వరూపుడు...
కృష్ణం వందే జగద్గురుం
నా స్వీయ రచన
[30/12, 11:14 AM] +91 90104 92494: మహతీ సాహితీ కవిసంగమం
ధనుర్మాస కవితోత్సవం-2024
తేదీ: 30/12/2024
శీర్షిక:కృష్ణశతకం
కవిపేరు:పి.వి.వి.యన్.రాజ కుమారి
కవి సంఖ్య:23
కవిత నంబరు:15
వేణువు గానము లూదగ
ప్రాణము పెట్టును ప్రియమగు పాటకు కాంతల్
బాణము వేయుచు మదిలో
వేణువు నూదుచు పిలిచెను ప్రియముగ కృష్ణా!53
కృష్ణుడె రాధకు ప్రాణము
కృష్ణుడె లోకము నంతయు గృపతో గాచున్;
కృష్ణుని నామము పలకగ
తృష్ణయె తీరును జనులకు తిరముగ కృష్ణా!54
అల్లరి కృష్ణుడు బుట్టెను
నుల్లము తీరగ పెరిగెనె యోగము తోడన్
చల్లని చూపులతో రే
పల్లెకు వచ్చెను ప్రియముగ పావన కృష్ణా!55
ప్రేమగ యశోధ తనయుని
నామము ముదమున దలచిన నరులకు వరమౌ
క్షేమము జయమును కలుగగ
భామలు వెన్నలు నొసగెను భక్తిగ కృష్ణా!56
[30/12, 11:30 AM] Ramakrishna: మహతీ సాహితీ కవిసంగమం
ధనుర్మాస కవితోత్సవం-2024
తేదీ: -30/12/2024
శీర్షిక: పాశురాలు
కవితా సంఖ్య:-14
కవిపేరు: మునగనూరి రామకృష్ణ
ధనుర్మాస కవితా సంఖ్య:-30
*ఆ.వె*
మధురమైన పలుకు మాటాడు నేర్పరి
సిగ్గు లేనిమొగ్గ చిన్నదాన!
పెరడునందు బెరుగు నెరకలువ లనుచు
గోదదేవి పిలిచె గోపికలను...
*ఆ.వె*
శంఖు చక్రధారి చక్రపాణి మురారి
వెన్న దొంగకడకు వెడలగాను
మేము వచ్చినాము మేలుకొనుమనుచు
గోదదేవి పిలిచె గోపికలను....
ఈపద్యాలు నాస్వంత రచనయని తెలుపుకొనుచున్నాను.
[30/12, 12:10 PM] Bhavani Krishna Murthy: మహతి సాహితి కవి సంగమం
ధనుర్మాస కవితోత్సవం.. 2024
తేదీ....30.12.2024
శీర్షిక.... భాగవతకథా సుధ
(కుచేలోపాఖ్యానం )
కవి పేరు: డా. జి. భవానీ కృష్ణమూర్తి
జాబితా సంఖ్య.... 49
కవిత సంఖ్య.........15
ప్రక్రియ....వచన కవిత
మిత్రమా!నీవు వేదాధ్యయనంలో దక్షులైన వారింట పుట్టావు
నీ భార్య సద్గుణాలతో నీకు తగిన మంచిస్వభావం కలది
నీ మనస్సు ఇంటివిషయాలు భార్యబిడ్డలపై ఉన్నట్లు లేదు
కారణము తెలుపమని మిత్రుని యడిగెను యా శ్రీహరి
తమ చిన్ననాటి విషయములను గుర్తు చేసినాడు
తమ గురువు అజ్ఞానమనేచీకటికి దీపం వంటివాడు
బ్రహ్మానందానుభవంలో నిమగ్నమైన మనస్సుకలవాడు
ఉత్తమ బ్రాహ్మణులలో ఉత్తముడు సత్కర్మపరాయణుడు
కుచేలుడు ఆప్తమిత్రుడు చెప్పినదంతా శ్రద్ధగా విన్నాడు
కృష్ణుడు గురుకులంలోని వృత్తాoతము గుర్తు చేశాడు
గురుపత్ని ఆజ్ఞపై వంటకి కట్టెలకై అడవికెళ్ళినప్పుడు
మేఘావృతమై భయంకరంగా ఉరుముల చప్పుడు
గాలివానతో ఆ యడవిలో జంతువులు కకావికలైనవి
ఎడతెగని వాన కురియుచుండగా ప్రొద్దు గ్రుoకినది
చిమ్మచీకటి అడవి అంతట పూర్తిగా అలుముకున్నది
ఇద్దరం వాన్లో తడిసి ముద్దయితిమని గుర్తుచేసే హరి
ఒకరిచేతినొకరు పట్టుకుని అడవియందే రాత్రిగడిపితిమి
తెల్లవారగనే పక్షుల కిలకిలారావములు మొదలయ్యేను
పొద్దుపొడవగనే గురువు సాందీపని మనకై వెదుకుతు వచ్చే
తడిసి చలిలో వణుకుచున్న మనల్ని చూచి విచారించిరి.
ఈ కవిత ణా స్వీయరచన అని హామీ
[30/12, 12:28 PM] Balluri Uma Devi: మహతీ సాహితీ కవిసంగమం
అంశము: ధనుర్మాస కవితోత్సవము/2024
తేదీ: 30/12/24
శీర్షిక: కనక దుర్గ శతకము
కవితా సంఖ్య:15
కవిపేరు: డాక్టర్ బల్లూరి ఉమాదేవి
కవి సంఖ్య:34
ప్రక్రియ: ఆటవెలది పద్యములు
భక్త జనుల కోర్కె వాసిగా తీర్చుచు
వరము లొసగు నట్టి పార్వతమ్మ
మాధవేశ్వరి యన మహినివెలసితీవు
కరుణ చూపు మమ్మ కనక దుర్గ. //57//
సకల సంపదలను జనులకు నొసగంగ
నాల్గు చేతు లందు నభయ ముద్ర
లలరగ నవరాత్రు లందగుపడు మాత!
కరుణ చూపు మమ్మ కనకదుర్గ. //58//
కన్నె పిల్లలకును కళ్యాణ మొనరించు
వేల్పు గాను భువిని పేరు బడసి
కానిపింతు వమ్మ కాత్యాయనీ మాత!
కరుణ చూపు మమ్మ కనకదుర్గ. //59//
దక్ష సుతవు నీవు దాక్షాయణీ దేవి
దగ్ధమైతి వపుడు దక్షునింట
మరల హైమవతిగ మహిని పుట్టిన యంబ
కరుణ చూపు మమ్మ కనక దుర్గ.
హామీపత్రము:
స్వీయ రచన
డా బల్లూరి ఉమాదేవి
[30/12, 1:08 PM] Gangadhar Kollepara: మహతీ సాహితీ కవిసంగమం
ధనుర్మాస కవితోత్సవం 2024
తేదీ : 30/12/2024
శీర్షిక : శ్రీ కృష్ణ భగవానుడు
కవిపేరు : గంగాధర్ కొల్లేపర
క్రమ సంఖ్య : 12
ప్రక్రియ : వచన కవిత (15)
**************************
అధర్మం పెరిగి అశాంతి నలుచెరగులా విస్తరించి లోకం అల్లకల్లోమవుతుంటే ....
గుండె పగిలి రోదిస్తూ అధర్మాత్ములను మోయలేనని శ్రీహరిని శరణు వేడె భూదేవి ...
దయార్ద్రహృదయుడు, లోకరక్షకుడు, ఆదిమధ్యాంత రహితుడు అభయమునిచ్చె...
శ్రావణ శుద్ధాష్టమి, రోహిణీ నక్షత్ర సమయాన నడిరేయి చెరసాలలో దేవకీ వసుదేవులకు అష్టమపుత్రుడై జన్మించెనాశ్రీహరి...
చరాచర విశ్వాత్మకుడు, లీలావిలాస వినోదుడు, కృష్ణ వర్ణుడు అనంత కళ్యాణ గుణోపేతుడు, జీవసమృద్ది కారకుడు....
కనులకు కాననివాడు,
ఊహలకు అందనివాడు, నిస్వార్ధ భక్తికి శరణాగతుడు యశోదానందనుడు...
పుట్టినవాడు తనమాయతో చెరసాల బంధనాలను త్రెంచి,
యమునను రెండు పాయలుగా చీల్చి వసుదేవునకు దారి చూపినాడు...
పాలుత్రాగే పసిప్రాయంలోనే పూతనను చంపి.బుడిబుడి
నడకల వయసులోనే శకటాసురాదులను దునిమాడినాడు ....
చిరుప్రాయంలోనే యశోదమ్మకు అండ పిండ బ్రహ్మాన్డాలను చూపినవాడు .....
మద్దిచెట్లను విరిచి గంధర్వులకు శాపవిమోచనం గావించిన కరుణాకరుడు ....
చాణూర ముష్టికులను మధించి, కంస సంహారం గావించి,
శిశుపాల జరాసంధులను చంపిన యోధుడు...
పార్థునకు అత్యంత ఆత్మీయుడు
వస్త్రాపహరణమున ద్రౌపది మానమును కాపాడిన కారుణ్యమూర్తి ...
కురుక్షేత్రమున గాండీవమును విడిచిన అర్జునునకు కర్తవ్యబోధతో
భగవద్గీతను ఉపదేశించి యుద్దోన్ముఖుని చేసిన గురువు ...
గాంధారి శాపప్రభావం, యాదవుల అంతఃకలహాలకు కారణమాయె,
నిషాదుని బాణం చేసిన గాయం పాంచభౌతిక దేహ అతీతుని నిర్యాణం జరిగె
ద్వాపరయుగం అంతమాయె...
హామీ : ధనుర్మాస కవితోత్సవం కోసం రాసిన ఈ కవిత నా స్వీయ రచన.
[30/12, 1:28 PM] +91 94405 30763: మహతీ సాహితీ కవిసంగమం
ధనుర్మాస కవితోత్సవం-2024
తేదీ:30.12.2024(సోమ వారం)
శీర్షిక:సుందరకాండ
కవిపేరు:కాటేగారు పాండురంగ విఠల్
ధనుర్మాస కవి సంఖ్య:01(కవితా సంఖ్య:15)
ప్రక్రియ:(పంచపది)వచనం
57
హనుమ కల్లోలపర్చి మకరతోరణమెక్కెనుగా
కపిని బంధించమని రావణు,సేన పంపెనుగా
మారుతి జయధ్వానంతో ముందుకు సాగెనుగా
ద్వారంకు బిగించిన ఇనుప గడియ తెంచెనుగా
సుందరం శ్రీరామ,సీత,వనం,కావ్యం,కపి విఠల!
58
హనుమ వచ్చిన వారిని వచ్చినట్లు చంపెనుగా
గర్జిస్తూ భీకరనాదము చేస్తూ విజృంభించెనుగా
వేయి మంది రావణులనైన సంహరిస్తాననెనుగా
ఎందరు సైనికులైనా నన్నేమీ చేయలేరనెనుగా
సుందరం శ్రీరామ,సీత,వనం,కావ్యం,కపి విఠల!
59
మహా బలవంతుడైన రామునకు జయమౌ గాక
పరాక్రమశాలి యైన లక్ష్మణునకు జయమౌ గాక
రామ విధేయ కిష్కింధ రాజుకు విజయమౌ గాక
హనుమ పలికె దృఢముగా లంక నాశనమౌ గాక
సుందరం శ్రీరామ,సీత,వనం,కావ్యం,కపి విఠల!
60
వాయుపుత్రుడు దేహాన్ని పర్వతాకారంలా పెంచె
చైత్య ప్రాసాదాన్ని కూలగొట్టి,విజృంభణ గావించె
పెద్ద స్థంభాన్ని పెకిలించి పరిఘలా ఉపయోగించె
గిర్ గిర్ గిరాయని తిప్పుతూ అందర్నీ సంహరించె
సుందరం శ్రీరామ,సీత,వనం,కావ్యం,కపి విఠల!
ఈ పంచపదులు నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను.
[30/12, 1:29 PM] venky HYD: మహతీ సాహితీ కవిసంగమం
ధనుర్మాస కవితోత్సవం
తేది: 30-12-2024 (సోమవారం)
శీర్షిక: తిరుపావై (ప్రక్రియ-వచనము)
కవిత సంఖ్య-10
కవి పేరు: కామవరం ఇల్లూరు వేంకటేష్
కవి సంఖ్య -60
వచనము
ఓం నమో వేంకటేశ్వరాయనమః
తిరుపావై పాశురాలు
ఏమిటమ్మా ఇది? నీవు ముందుగా లేచి మనలను
మేల్కొలుపుతావు అనుకుంటే, నిద్ర పోతున్నావు
చూడు పెరటిలో ఎర్ర కలువలు వికసించినాయి
తెల తెలవారింది ఇకనైనా లేవమ్మా! తల్లి లేవమ్మా!
కుంచెకోలను తాళంచెవి తీసికొని కోవెల తలుపు
తెరవడానికి వెళ్తున్నారు! యోగులు మునులు
ప్రాతఃకాల సంధ్యలు తీర్చడానికి సిద్ధమవుతు
పరిపూర్ణురాలవు కదా! లేచి రావమ్మా! లే!
శంఖ చక్రధారి, సుందర నయనుని కీర్తించ
పంకజాక్ష శ్రీ కృష్ణుని పూజించడానికి లెమ్ము
వెంటనే లేవమ్మా, లేచి అందరితో కలిసి
వ్రతమును పూర్తి చేయమని ఆండాళ్ కోరె!
వేం*కుభే*రాణి
హామీ పత్రం: ఈ వచనము నా స్వంతమని తెలియ చేస్తున్నాను.
[30/12, 1:48 PM] +91 80085 72446: మహతీ సాహితీ కవిసంగమం
ధనుర్మాస కవితోత్సవం-2024
తేదీ: 30-12-2024
శీర్షిక: సుభాషితాలు
కవిత సంఖ్య:15
కవిపేరు: కందూర్ చంద్ర ప్రకాశ్ గుప్తా
కవి సంఖ్య:11
మంచి పనులెన్ని మరెన్నో జేయాలని కాచుకోడు
సమవర్తి రోగమైనా అసువులు తీయంగ యాగడు
మంచిపనుల జేయుము శక్తిసామర్థ్యమున్నప్పుడు
రేపున్నదో లేదో తెలియదు కాన చేయుమది నేడు
సహృదయునకు ముహూర్త బలాలెందుకు కందూర్
జనన మరణాల మధ్య కాలమే జీవితము
నిజ అనుభవాల మాలికా సమాహారము
అందాల కవర్ పేజీలుమాత్రం బహిరంగము
పుట పుటలో ఎన్నో విషయాలు రహాస్యము
ప్రతి రోజూ అనుభవాల భిన్న సుమాలహారం కందూర్
తల్లి గర్భం ఒకటే కాని వేర్వేరు విషయాలు
మనిషి మనిషికీ తమ జీవితాన వైవిధ్యాలు
సుఖదుఃఖాలు కావడి కుండలు మామూలు
వారి వారి అనుభవాలు మానసిక స్థైర్యాలు
అనుభవఙ్ఞుల సూచనలు మార్గదర్శకాలు కందూర్
హామీ పత్రం: పై పంచపదులు నా స్వంత రచన అని హామీ ఇస్తున్నాను
[30/12, 1:52 PM] Limbadri Alagandula: మహతీసాహితీ కవి సంగమం
ధనుర్మాస కవితోత్సవం.2024
తేదీ. 30.12. 2024
కవిత సంఖ్య.15
శీర్షిక. శ్రీహరికి వినతి
ఎలగందుల లింబాద్రి
నిజామాబాదు 22
ప్రక్రియ పద్యం
తే.గీ.
సృష్టిలో గుళ్ళుదేవుళ్ళు శ్రేష్టమనుచు
నర్చనలు చేయుచుందురే యతివలిలను
వారు లేకున్న పూజించు వారలేరి?
దీన రక్షక లక్ష్మీశ దేవదేవ!
ఈ పద్యము నేను స్వయంగా వ్రాసినానని హామీ ఇస్తున్నాను.
[30/12, 1:52 PM] +91 99122 33739: మహతీ సాహితీ కవిసంగమం
ధనుర్మాస కవితోత్సవం-2024
30-12-2024
కవితా సంఖ్య:14
శీర్షిక: ఆలాపన
బి.వి.వి.సత్యనారాయణ
కవిసంఖ్య:15
ప్రక్రీయ:పద్యం
ఆ.వె:
మురళి గానమువిన ముక్తిమార్గముతోచు
గోపికామణులకు తీపియౌను
కమ్మనైన పాట కనులపండుగజేయ
నాట్య మాచరించు నగవుతోడ!!
ఇది నా స్వీయ రచన!!
[30/12, 4:31 PM] +91 94404 08080: మహతీ సాహితీ కవి సంగమం
ధనుర్మసా కవితోత్సవం 2024
అంశం.ఐచ్చికం
తేదీ 30/12/24
కవితా సంఖ్య 15,కవి సంఖ్య 56
ప్రక్రియ.వచనం
శీర్షిక. అద్వానీ
పేరు. ఉమాశేషారావు వైద్య
------ --------------------------------
ఆయన భారతీయ రాజకీయాల్లో భీష్ముడు
కల్మషం లేని హైందవ ప్రియుడు
అటల్ జి అనుంగ సహచరుడు
రథయాత్ర తో రామ నామాన్ని
ఇంటింటా నింపే
రామ భక్తుడై
భాజపా ను అధికారంలోకి తెచ్చి
ఉప ప్రధానిగా,హోం మంత్రిగా
వన్నె తెచ్చే
అధికార దాహానికి ఆమడ దూరం
నీతి నిజాయితీలకు నిలువుటద్దం
వారసత్వ రాజకీయాలకు ఇవ్వలేదు
అవకాశం
ఎన్నో వెధనాలు, అవమానాలు
ఐదువందల ఏండ్ల స్వప్నానికి శ్రీకారివి
భారత రత్న అవార్డ్ భారతీయులు
గర్వంగా ఉప్పొంగే ఆనందభాష్పాల
తో మీ మీ వ్యక్తిత్వానికి కి సొగసు
అక్షారాల అద్వాని
భారతీయుల వాణి
[30/12, 5:12 PM] Mahalakshmi: మహతీ సాహితీ కవిసంగమం
ధనుర్మాస కవితోత్సవం-2024
తేదీ: 30-12-2024
శీర్షిక: బుజ్జి గాళ్లు (జీవన సాఫల్యము)
కవిపేరు:డి.ఎస్.వి.మహాలక్ష్మి
కవి సంఖ్య:42
కవితా సంఖ్య:11
ప్రక్రియ:వచన కవిత
కవిత:
లోకం తెలియని బాలలకు వచ్చింది ఎలాగో కుళ్లు.
ప్రవర్తనా లోపాలు ముదిరే సరికి పెరిగే సవాళ్లు.
నడిచే దారిలో ఎదురు పడేవన్నీ ముళ్లు.
స్వేచ్ఛ అనుకుని భ్రమలో పరుగెడతాయి కాళ్లు.
చూడకూడనివి చూడడానికి అలవాటు పడతాయి కళ్లు.
అవుతారు ఎంత దంచినా నలగని పిప్పళ్లు.
ఇంటి నుంచి పారిపోయి కొడతారు బండ రాళ్లు.
ఏదోకటి ఆకలి తగ్గడానికే కదాని తినేస్తారు ఎంగిళ్లు.
అపుడపుడు దొరకవు వారికి దోసెడు మంచి నీళ్లు.
అపరిశుభ్రతకు అభద్రతకు అవుతాయి శరీరంపై పుళ్లు.
కరుడు కట్టిన కసాయితనం దోపిడీకి ఆనవాళ్లు.
పసితనం వీడకనే చేదు అనుభవాలకు అవుతారు ముసలోళ్లు.
నిర్బంధ విద్యా విధానంతో ఉన్నాయి ప్రభుత్వ బళ్లు.
రూపాయి ఆర్జన కోసం పంపరు బళ్లకు కన్నోళ్లు.
ఎప్పుడు వచ్చునో నిజమైన బాల్యానికి తిరునాళ్ళు.
బాల పాదాల ముద్రలతోనే నిండి పోవు మళ్లు.
నేరాలెన్నింటినో తెలియక చేసి పట్టుబడతారు పసివాళ్లు.
మొగ్గ లాంటి పసితనాన్ని చిదిమేస్తున్నారు పనికి మాలినోళ్లు.
బాల నేరస్థులును విచారించి వుంచేవి పరివర్తనా ఇళ్లు. (జువెనైల్ హోమ్)
బాలల పరిరక్షణకై పాటుపడాలి భారత లోగిళ్ళు! సాయి విజయా!
హామీ పత్రము: స్వీయ రచన
[30/12, 5:53 PM] +91 96401 15956: మహతి సాహితీ కవి సంగమం
ధనుర్మాస కవితల పోటీ
30/12/2024
సోమవారం
అంశం దశావతారాలు (15)
శీర్షిక : శ్రీ రామ చంద్రుడు
బిరుదు రాజు ప్రమీల రాణి ( 17)
అయోధ్యా పుర మహారాజు దశరథుడు ఆయనకు ముగ్గురు భార్యలు..
కౌసల్యా, సుమిత్ర, కైకేయి
సంతు లేక పుత్రకామేష్టి యాగం చేసినారు..
వారి అదృష్టవశం గా
యజ్ఞ పురుషుడు
ప్రత్యక్ష మై
ప్రసాదం గా. పాయసాన్న పాత్ర నిచ్చే..
ఆ ప్రసాద ఫలితంగా నలుగురు పండటి. నలుగురు మగ బిడ్డలు కలిగారు..
రామ భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు
దిన దిన ప్రవర్థమానం గరుగుతున్నారు..
రాముని ముద్దు మోము ను చూడనిదే వుండలేని
కైకేయి అత్యంత ప్రేమగా గారాబు చేసేది..
వదిలి క్షణం కూడా వుండేది కాదు
ముగ్గురు తల్లులతో నలుగురు బిడ్డలు ఆనందంగా వున్నారు..
ఆకాశాన వున్న చంద్రబింబం కావాలని బువ్వకూడా తిననని రాముడు మారాం చేయ సాగాడు..
పెద్ద అద్దము తెచ్చి అందు చంద్రుని ప్రతి బింబంను చూపి రాముని సంతృప్తి పరచిరి..
అప్పటి నుండి శ్రీ రాముని రామ చంద్రుని గా పిలిచిరి అందంలో చంద్రుని కంటే అందగాడు రాముడు ..
నీల మేఘ శ్యామ సుందరుడు శ్రీ రామ చంద్ర మూర్తి..
[30/12, 5:54 PM] Addanki Lakshmi: మహతి సాహితీ కవి సంగమం ధనుర్మాస కవితోత్సవం
తేదీ 30_12_24
కవితా సంఖ్య13
పేరు అద్దంకి లక్ష్మి ఊరు ముంబై
శీర్షిక పుణ్యక్షేత్రాలు
శుక్రేశ్వరాలయం గౌహతి
కవి సంఖ్య 50
ప్రక్రియ కవిత
గౌహతీ లో ప్రసిద్ధ శుక్రేశ్వర ఆలయము
శుక్రేశ్వర కొండమీద గల శివాలయము
బ్రహ్మపుత్రా నది తీరమందు పుణ్యక్షేత్రము
చిన్న పాన మట్టముపై వెలసిన లింగా కారము
రాక్షస గురువు శుక్రాచార్యులు ప్రతిష్టింపబడినది
శుక్రేశ్వరుడు సుఖనాథగా పిలువబడతాడు
బ్రహ్మపుత్ర నది ఒడ్డున, కొలువై ఉన్నాడు
శుక్రాచార్యుడు కొండమీద తపస్సు చేశాడు
యజ్ఞం చేస్తూ ఉండగా శివుడు ప్రత్యక్షమయ్యాడు,
శుక్రేశ్వరుడు సుఖనాథగా పిలువబడతాడు
బ్రహ్మపుత్రా నది ఒడ్డున ప్రఖ్యాతిగాంచినది
పర్యాటకులకు నది సుందరదృశ్యం గా కనిపిస్తుంది
అహోం రాజుల కాలంలో నిర్మించబడింది
అస్సామీ వాస్తు శిల్పానికి ఉదాహరణగా ఉంది
ఏనుగు మూపురం ఆకారంవల్ల హస్తగిరి అంటారు లక్ష్మీ అద్దంకి
హామీ ఈ కవిత నా స్వీయ రచన
[30/12, 6:03 PM] P Padmavthi: మహతీ సాహితీ కవి సంగమం
ధనుర్మాస కవితా మహోత్సవం 2024
30/12/24 సోమవారం
కవన సంఖ్య..12 క్రమసంఖ్య..13
డా.పద్మావతి పి.. హైదరాబాద్
ప్రక్రియ.. వచన కవిత
శీర్షిక.. వృద్ధాప్యం!
బ్రతుకును భారంగా ఈడుస్తూ
ముదిమిలో కూడా కష్టం వీడని దారిద్ర్యంతో
బాధ్యతా కర్తవ్యాల మధ్యన నలిగిన మనసుతో
కాలం మాటున కరిగిపోయిన వయసు..
తనవారనుకున్న వారంతా దూరం నెట్టినా
కన్నీళ్ళను గుండెల నిండా దాచిన నీ స్థైర్యం
నిను ఒంటరి దానిని చేసినా మనోధైర్యం వీడక
పట్టు వదలని విక్రమార్కుడిలా
రెక్కలు విరిగినా
బండితో, బ్రతుకు బండిని లాగుతున్న
ఆత్మాభిమానం సడలని పట్టుతో
ఎవ్వరికీ భారం కాకూడదంటూ
రెక్కల కష్టాన్ని నమ్ముకున్న వృద్ధాప్యం
భారం అనుకోకుండా
ముళ్ళ బాటను రహదారిగా చేసుకొన్న
అమ్మ తెగువ
నే అబలను కాను సబలను అని
ఆదిశక్తిగా అవతరించిన ఆదర్శమూర్తి ..
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
ఇది నా స్వీయ కవిత
[30/12, 6:08 PM] +91 98485 93401: మహతీ సాహితీ కవిసంగమం
ధనుర్మాస కవితోత్సవం-2024
తేదీ: 30.12.2024
సోమవారం
శీర్షిక:ధనుర్మాసం
కవిపేరు:తిరుమల మనోహరా చార్యులు
కవి సంఖ్య 46
కవిత :వచనం 15
*********************
ముందే మేల్కొని మమ్మల్ని లేపుదువనే మాట ఇచ్చినావు ఓ పరిపూర్ణురాల నీవు మరిచిపోయినావు
నీ పెరటి తోటలోని దిగుడుబావిలో
నీలోత్పములు ముడుచుకున్నవి
ఎఱ్ఱని తామరలు వికసించిచున్నవి
కాషాయంబరులైన మునీశ్వరులందరు తమ ఆలయాల్లో భగవదారాధనచేయుటకై కుంచెకోలను తాళంచెవులను తీసుకొని వెళ్లుచున్నారు కోవెల ద్వారాలు తీయడానికై
ఆజానుబహుడు శంఖుచక్రాలు ధరించిన పుండరీకాక్షుడగు శ్రీకృష్ణుడి గుణగణాలను స్మరిస్తున్నామమ్మా
మాటనేర్పుగాలదానివి యోగ్యతకాలదానివి అందరం కలిసి ఆ స్వామిమహిమలను కీర్తించుదాం లేచిరావమ్మా!
గోదావ్రతములో పాల్గొనండి
రంగనికృపకు పాత్రులుకండి.
పారమార్థిక సాధనకై రాస్తున్నవి
మనోహరుని మధురభక్తి భావనలివి.
హామీపత్రము: ఇది నా స్వీయరచన
[30/12, 6:09 PM] M V Padmavathi: మహతి సాహితీ కవి సంగమం.
కరీం నగరం.
ధనుర్మాస కవితోత్సవం.2024
30/12/24.సోమ వారం.
మైలవరపు వెంకట పద్మావతి.
కాకినాడ .18 .
శీర్షిక .గోప బాలికలు .15.
గోప బాలికలంతా స్వామిని పిలుస్తూ
పంఖజ నేత్రా , పుండరీ కాక్షా అంటూ పిలువ
లేత చిలుకా గోప కాంతా రారండి రారండి ....
శ్రీ కృష్ణ భగవానుని యోగ్యతలను పొగడగా
పరిపూర్ణత పొంద
సమర్ధత గల గోదాదేవి
గోప బాలికలను పరీక్షించగా
నీ దర్శనం ఇయ్యామ్మా మాకు
చిత్ర విచిత్ర మాయలు చేయు మాయావి
శ్రీ కృష్ణావాతార పుట్టింది మధురలో
పెరిగే గోకులం లో
మధురా నగరి చేరినా కంస సంహారివి
గోకిలం లో పూతన, శకటాసురుడు ,అశ్వాసురుడు,బకాసురుడు ల సంహరించే
కళ్యాణ గుణా మధరలో కువలయపీడాన్ని ,
చారూణముస్టికులను కంసుని చంపి ఉగ్ర సేనుని రాజుగా చేసే మధురా నగరికి
పది రకాల జ్ఞానులను జ్ఞాన దశలతో దర్శన యోగ్యత కలిగించు మాధవా మధుసూదన మూర్తీ ...🙏
హామీ .స్వీయ రచన.
[30/12, 6:11 PM] KrishnaReddy.Gaddam: మహతీ సాహితీ కవిసంగమం
ధనుర్మాస కవితోత్సవం-2024
తేదీ: 30/12/2024
శీర్షిక: పెద్దల మాట
కవిపేరు: గడ్డం కృష్ణారెడ్డి.సూర్యాపేట
జాబితా సంఖ్య:10
కవితా సంఖ్య: 15
ప్రక్రియ: పద్యము ఆటవెలది!
అక్షరాలు నేర్పి యజ్ఞాన తిమిరమ్ము
పారద్రోల గురువు చేరదీయ!
శిష్యులకు దొరకును శ్రీరామ రక్షయే
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!
స్వీయరచన..........
[30/12, 6:36 PM] J Madhusudhan Sharma: *మహతీ సాహితీ కవిసంగమం*
*ధనుర్మాస కవితోత్సవం-2024*
*తేదీ: 30-12-2024*
*శీర్షిక: మంచి కార్యములు
*కవితా సంఖ్య:*15
*కవిపేరు:* జోషి మధుసూదన శర్మ
*కవి సంఖ్య:* 27
*ప్రక్రియ* పద్యములు ( ఆటవెలదులు )
పదము పలుక వలెను పలుకతేనెయునూర
మాట లాడ వలెను మనసు దోచ
మాట పలుకుకున్న మహిమ యిదియె
మాధువుని పలుకిది మాన్యులార!
ధర్మకార్యములను ధాత్రిపై నిత్యము
జేయుచుండ మనకు చెరుపు గాదు
మనము జేయ నదియు మనలనె గాపాడు
మాధవుని పలుకిది మాన్యులార!
*హామీపత్రము:*స్వీయరచన అని తెలియజేస్తున్నాను.
[30/12, 6:51 PM] Y Vara Lakshmi: *01*
శ్రీమతి రాధా సురేష్ గారు *చిరస్మరణీయులు* శీర్షికతో స్వతంత్ర భారతికోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను ఎప్పటికీ మరువకూడదు.. వారే భారతమాతకు ముదచదుబిడ్డలు అంటూ రాసిన మీ కవిత దేశభక్తిని కలిగించే విధంగా ఉన్నది. ధన్యవాదములు మరియు అభినందనలు.👏👏👏🌺🌺🌺🙏🙏🙏
[30/12, 6:52 PM] Y Vara Lakshmi: *02*
శ్రీ యేచన్ చంద్రశేఖర్ గారు *ద్వరబంధనాల చంద్రయ్య దొర లేక నాయుడు* శీర్షికతో. అల్లూరి కంటే ముందే విప్లవవీరుడై అల్లూరికి మార్గదర్శకుడయ్యాడు. భరతమాతను దాస్య శృంఖలాల నుండి విముక్తి చేయడానికి కృషిచేసిన ఎందరో వీరుల కనీసం పేర్లు కూడా తెలియదు. అటువంటి వారి గురించి సేకరరించి తెలియజేయడం ఎంతైనా అవసరం నేడు. ఆపని చేస్తున్న మీకు ధన్యవాదములు మరియు అభినందనలు. 👏👏👏🌺🌺🌺🙏🙏🙏
[30/12, 6:54 PM] Y Vara Lakshmi: *03*
శ్రీ బాచిరాజు సత్యనారాయణ రావు గారు *ఆండాళ్ తిరువడిగళే శరణం* శీర్షికతో గోదాదేవి ధనుర్మాస సందర్భంగా శ్రీరంగనాథుని సేవకు తన చెలికాండ్లను వరుసగా నిద్రలేపుచూ....పాడుచున్న మేల్కొలుపుతూ,శ్రీకృష్ణుని లీలావైభవం వివరించడం బాగుంది. ధన్యవాదములు మరియు అభినందనలు.👏👏👏🌺🌺🌺🙏🙏🙏
[30/12, 6:54 PM] Y Vara Lakshmi: *04*
శ్రీమతి ఎస్. రత్నలక్ష్మి గారు *కడుపు కోత* శీర్షికతో నీతి నిజాయతీలు, విలువలను గాలికొదలకుండా, కన్నతల్లి ఉన్న ఊరు, జన్మభూమి కోసం మనస్పూర్తిగా చరించేవారే చిరస్మరణీయులు, చరితార్థులు.... అలా ఉండాలి అని కోరుకుంటూ రాసిన సందేశాత్మక కవిత బాగుంది. ధన్యవాదములు మరియు అభినందనలు.👏👏👏🌺🌺🌺🙏🙏🙏
[30/12, 6:55 PM] Y Vara Lakshmi: *05*
శ్రీ టి ఆర్ కె కామేశ్వరరావు గారు *తిరుప్పావై పాశురం - 15* (లేత చిలుక కంఠం దానా) శీర్షికతో ఒక్కొక్క గోపికను నిద్రలేపుచూ ధనుర్మాసంలో కాత్యాయనీ వ్రతం ఆచరించుటకు సన్నుద్ధులను చేస్తూ...ఆ గోవిందుని స్తుతిస్తూ రాసిన పాశుర భావం మీ కవితలో బాగుంది. ధన్యవాదములు మరియు అభినందనలు.👏👏👏🌺🌺🌺🙏🙏🙏
[30/12, 6:55 PM] Y Vara Lakshmi: *06*
శ్రీ వి టి ఆర్ మోహనరావు గారు *తిరుప్పావై పాశురం-15* శీర్షికతో ధనుర్మాసంలో గోదాదేవి తన స్నేహితులతో కలిసి చేస్తున్న కాత్యాయని వ్రతం కొరకు స్నేహితులను తెల్లవారుజామున మేల్కొలుపుతూ రంగనాథుని లీలలు గుణగణాలు వివరిస్తూ పాడిన అద్భుతమైన పాశుర అనువాద కవిత బాగున్నది. ధన్యవాదములు మరియు అభినందనలు. 👏👏👏🌺🌺🌺🙏🙏🙏
[30/12, 6:56 PM] Y Vara Lakshmi: *07*
శ్రీమతి డా. యం అహల్యాదేవి గారు *జ్ఞాన సుధ* శీర్షికతో రాసిన ధనూరాశి యొక్క లక్షణాలను వ్రాసిన విధము బాగున్నది. ధన్యవాదములు మరియు అభినందనలు.👏👏👏🌺🌺🌺🙏🙏🙏
[30/12, 6:57 PM] Y Vara Lakshmi: *08*
శ్రీమతి సత్యవీణ మొండ్రేటి గారు *అపురూప పాశురాలు* శీర్షికతో పాశురాల రమ్యమైనవనీ, భక్తిపూరితమైనవనీ, ఆ రంగనాధుని చక్కగా వర్ణించిన మీ కవిత బాగున్నది. ధన్యవాదములు మరియు అభినందనలు.👏👏👏🌺🌺🌺🙏🙏🙏
[30/12, 6:58 PM] Y Vara Lakshmi: *09*
శ్రీమతి డా. భవానీ కృష్ణమూర్తి గారు *భాగవత కథా సుధ (కుచేలోపాఖ్యనము)* శీర్షికతో శ్రీ కృష్ణునికి కుచేలునికి మధ్య జరిగిన సంభాషణను మీదైన శైలిలో వ్రాసిన కవిత బాగుంది. ధన్యవాదములు మరియు అభినందనలు అక్కా!.👏👏👏🌺🌺🌺🙏🙏🙏
[30/12, 6:58 PM] Y Vara Lakshmi: *10*
శ్రీ గంగాధర్ కొల్లేపర గారు *శ్రీ కృష్ణ భగవానుడు* శీర్షికతో కృష్ణావతారం గురించి మీరు రచించిన కవిత ( సోదహరణముగా) బాగున్నది. ఓం నమో శ్రీ కృష్ణాయ నమః.. ధన్యవాదములు మరియు అభినందనలు.👏👏👏🌺🌺🌺🙏🙏🙏
[30/12, 6:59 PM] Y Vara Lakshmi: *11*
శ్రీ కె. పాండురంగ విఠల్ గారు *సుందరకాండ* శీర్షికతో హనుమంతుడు లంకను ఏ విధంగా అతలాకుతలం చేశాడో చక్కటి వర్ణనలతో వివరించారు ధన్యవాదములు మరియు అభినందనలు. 👏👏👏🌺🌺🌺🙏🙏🙏
[30/12, 6:59 PM] Y Vara Lakshmi: *12*
శ్రీ కామవరం ఇల్లూరు వేంకటేష్ గారు *తిరుప్పావై* శీర్షికతో గోదాదేవి గోపికలను నిద్ర లేపుటను, శ్రీకృష్ణుని గుణగణాలపు స్తుతించడం మీ కవితలో వివరించారు. ధన్యవాదములు మరియు అభినందనలు.👏👏👏🌺🌺🌺🙏🙏🙏
[30/12, 7:00 PM] Y Vara Lakshmi: *13*
శ్రీ కెసిపి గుప్తా గారు *సుభాషితాలు* శీర్షికతో రేపు అన్నది ఉన్నదో లేదో మూడు నాలుగు ముచ్చటైన ఈ జీవితంలో ఈర్షకు అసూయకు తావు లేకుండా మంచి పనులను చేయడం మానవ ధర్మం అంటూ చక్కని సుభాషితాలను తెలియజేశారు ధన్యవాదములు మరియు అభినందనలు.👏👏👏🌺🌺🌺🙏🙏🙏
[30/12, 7:00 PM] Y Vara Lakshmi: *14*
శ్రీ ఉమాశేషారావు గారు *అద్వానీ* గురించి హైందవమతోద్ధారకుడు అంటూ రాసిన రచన బాగుంది. ధన్యవాదములు మరియు అభినందనలు.👏👏👏🌺🌺🌺🙏🙏🙏🙏
[30/12, 7:01 PM] Y Vara Lakshmi: *15*
శ్రీమతి డి యస్వి మహాలక్ష్మి గారు *బుజ్జిగాళ్ళు* శీర్షికతో మీరు రాసిన కవితకు విప్పాలి తల్లిదండ్రులు కళ్ళు.. లేదంటే పిల్లల బ్రతుకులు ఔతాయి చిక్కుకున్న సాలెగూళ్ళు .... ప్రభుత్వం తెరవాలి సరైన చట్టపు వాకిళ్ళు...మీకవిత *ళ్ళు* అంత్యప్రాసతో ...చదువుతుంటే నా గుండె అదురుళ్ళు. సందేశాత్మకమైన, సత్యమైన, వర్తమానం తేటతెల్లంగా చూపు మీ కవిత అదరహో! సఖీ! ధన్యవాదములు మరియు అభినందనలు. 👏👏👏🌺🌺🌺🙏🙏🙏
[30/12, 7:07 PM] Ashish Chaithra: మహాతీ సాహితీ కవిసంగమం
ధనుర్మాస కవితోత్సవం-2024
తేది:30.12.2024
శీర్షిక:గోదాదేవి గీతిక -15
కవిపేరు.రావుల మాధవీలత
ఊరు.హుజురాబాద్
కవిత సంఖ్య.15
క్రమసంఖ్య.45
ఏమి నిద్రయో ఇది
ఇంకను మేలుకొనక
నీ స్వరము తీయనిది
నీ పలుకు మధురమని
నీ తోడు కోరితిమి
నీ దురుసు తనమేల
నీ తప్పు తెలిసెగా
నీ వింక రావేల
ఎల్లరేతెంచితిమి
ఏది నీదర్శనం
ఏమి చేయుదమంటు
ఈ ప్రశ్న నీకేల
మాయావి స్వామిని
మనసార కీర్తించు
మధుసూదనా వినుము
మధురమైన గీతిక
ఈ ఇష్టపది నా స్వీయరచన అని పూర్తిగా హామీ ఇస్తున్నాను.
[30/12, 7:20 PM] GV Suryanarayana: మహాతీ సాహితీ కవిసంగమం
ధనుర్మాస కవితోత్సవం - 2024
30/12/2024 ( సోమవారం )
అంశం: గీతా ప్రభోధ సారం!
శీర్షిక/ప్రక్రియ: జ్ఞాన యోగం /(ఇష్టపది- 15)
కవి: గోపరాజు వెంకట సూర్యనారాయణ (36)
@@@@@@@@@@@@@@@
కవిత
జ్ఞాన యోగం!
1)
జన్మ రహిత నిత్యుడ జగన్నాధుడ నేను!
ధర్మ రక్షణ కొరకు ధర నవతరించెదను!!
అవని నాజన్మ తత్వ మెవ్వడు యెరుంగునో!
మరణానంతరమున మరు జన్మ పొందడు!!
నన్నెట్లు సేవింప నటులె నా రక్షణలు !
నన్ను శరణు జొచ్చిన నాదయ పొందగలరు!!
గుణ కర్మల విభజన గణనన సృష్టి చేయ,
కర్మ ఫల మాసింప గాన కర్తనుగాను!!
@@@@@@@
******************************************
హామీ పత్రం:
ఈ కవిత నా స్వీయరచన. దేనికీ అనువాదం కానీ, అనుకరణ కానీ కాదని హామీ ఇస్తున్నాను.
గోపరాజు వెంకట సూర్యనారాయణ.
[30/12, 7:21 PM] +91 97037 54460: మహతి సాహితీ కవి సంగమం
ధనుర్మాస కవితోత్సవం_ 2024 తేదీ -30- 12-2024
శీర్షిక- కృష్ణ భాగవతం
ప్రక్రియ- వచనం
కవితా సంఖ్య _13
పేరు -అన్నపూర్ణయంజాల
కవిసంఖ్య-51
విదురునకు మైత్రేయుడీరీతి తెలిపెనని
శుకమౌని పరీక్షిత్తు తో వివరించెను
సృష్టి సంస్థాపనకు బ్రహ్మనే సృష్టించి
నాభియందు పద్మ పీఠమున నిలుపెను
పరమాత్మ మహిమచే పదునాల్గుభువనాలు
విధాత సృష్టించి వెలసిల్లజేసెను
అణువు నుండి బ్రహ్మాండము పుట్టెను
దేవగణములు రుద్ర రౌద్రులుదయించిరి
బ్రహ్మదేహం నుండి స్వయంభువు జన్మించే
ఉత్తమోత్తములగు రుషి గణము వర్ధిల్లె
శ్రీహరి కరుణించి యజ్ఞవరాహుడై
హిరణ్యాక్షు వధించి భువిని పైకి తేల్చే
హరితన దేహమున వివిధ వర్ణాలను
జాతులను సృష్టించి జీవుడై తానుండె
స్వయంభువు ధక్షుడై భువిని పాలించెనని
మైత్రేయుడీరీతి విధురునికి తెలిపెను.
ఈ వచన రచన నేను స్వయంగా రాశాను
[30/12, 7:21 PM] +91 94412 50941: మహతి సాహితీ కవి సంగమం
ధనుర్మాస కవితోత్సవం 2024
తేదీ: 30/12/2024(సోమవారం)
కవిత సంఖ్య(14)
గాండ్ల నర్సింలు (40)
ప్రక్రియ: తేటగీతి పద్యాలు
**********************
తే. గీ.(31)
జనులహితము గోరునెపుడు జగతి నందు
కష్టపడుచుండు తానును నిష్టముగను
ఆదరించుమనన
యాత్మతోడ
ఆకలార్పును రైతన్న యవనిజనుల!!!
తే. గీ.(32)
కూరగాయలు పండించు కొత్తవెన్నొ
విందు భోజనంమనకు పసందుబెట్టు
రైతు కష్టాన్ని యెరిగిన రాజులేరి?
ఆకలార్పును రైతన్న యవనిజనుల!!!
తే. గీ.(33)
నాట్లు వేయగా రైతన్న నడుమువంచి
స్వేదమును చిందించుచు చేయుకృషిని
చిగురు తొడగగా ఫైరులు చింతబాయు
ఆకలార్పునురైతన్న యవనిజనుల !!!
తే. గీ.(34)
చీడపీడలు నాశించి చీల్చు పైరు
కలత చెందును రైతన్న కనులకింత
నిద్ర హారాలు మానియు నీరసించు
ఆకలార్పును రైతన్న యవనిజనుల!!!
ఇది నా సీయ రచన.
[30/12, 7:22 PM] Jakkani Gangadhar: మహతీ సాహితీ కవిసంగమం
ప్రతిరోజూ కవితా పండుగే
అంశము: ఇచ్చికం - మా అమ్మే కావాలి
తేది: 30.12.24
శీర్షిక: జనని
ధనుర్మాస కవితా సంఖ్య: 39
కవి పేరు: జక్కని గంగాధర్
మహతీ సాహితీ కవిసంఖ్య: 73
ప్రక్రియ: పద్యం
ఈవారం కవితా సంఖ్య: 15
ఆ.వె
ఆలి మెప్పుకొరకు అమ్మను వీడకు
అమ్మ జన్మనిచ్చి యవని జూపె
జన్మ జన్మలకును జననినే కోరుకో
జక్కనార్యు మాట జయము నిడును!
---------------8---------------
ఫై పద్యం నా స్వంత రచన. అని హామీ ఇస్తున్నాను.
[30/12, 7:25 PM] +91 81214 30560: మహతీ సాహితీ కవిసంగమం
ధనుర్మాస కవితోత్సవం-2024
తేదీ: 30/12/2024
శీర్షిక: నవీన మార్గాన్ని..
కవి పేరు: డి.టి.హేమంత్ సింగ్
క్రమసంఖ్య:32
కవిత:15
ఓ కవి మేలుకోవా.. సమాజ చైతన్యానికి
పూనుకోవా..
అనారోగ్యానికి అపరిశుభ్రతే కారణమని ..
ఆరోగ్యాన్ని పాడు చేసే అలవాట్లే మూలమని ..
తరతరాలుగా పెద్దలు నేర్పిన సాంప్రదాయ పద్ధతులు..
ఆచరించిన విధానాలు గుర్తు చేస్తూ..
కాళ్లు చేతులు కడుక్కోవడం పళ్ళు ఫలాలు శుభ్రం చేసుకుని తినడం..
ఆహార పదార్థాలు పౌష్టికరమైనవి ఇంట్లోనే తయారు చేసుకోవడం..
ఇల్లు వాకిలి చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం...
రుచులను ఆస్వాదించడం కాదు ఆరోగ్యానికి మంచివైన అలవాట్లు..
శరీర వ్యాయమాన్ని కలిగించే విధానాలు..
కనుమరుగైపోయి ఈనాటి ఆధునిక సమాజంలో..
భుజించే చిరుతిళ్లు ఆహార పదార్థాలు మారుతున్న నేటి వ్యవస్థలో..
కల్తీ పదార్థాలు మసాలా ద్రవ్యాలు రకరకాల నూనెలు..
ఊహించని ఎన్నో రసాయనిక సమ్మేళనాలు..
ఆహారంలో కలిసి ఉండటం వల్ల అనారోగ్యానికి గురయ్యేవారు..
ఆకస్మికంగా జబ్బులకు గురై బాధలు పడేవారు మరణించేవారు...
ఎందరో ఎందరో అవన్నీ గమనించి..
రుచులకు ఆకర్షణలకు లోనై పౌష్టికత లేని ఆహారానికి అలవాటు పడి..
జీవితాన్ని విషతుల్యంగా మార్చుకుంటున్న మనుషులలో మార్పు కోసం ...
ఓ కవి కవిత్వాన్ని రచించావా నవీనమార్గాన్ని అందరికీ సూచించచవా....
డి.టి. హేమంత్ సింగ్
హామి పత్రం
. నవీనమార్గాన్ని....అనే ఈ కవితను నేనే స్వంతంగా రాశాను ఇది దేనికి అనుసరణ కాని అనువాదం కాని కాదని ఎందులోనుండి కాపి కొట్టలేదని రాతపూర్వకంగా తెలియజేస్తున్నాను
ఇట్లు
డి.టి. హేమంత్ సింగ్
[30/12, 7:28 PM] Y Vara Lakshmi: *16*
శ్రీమతి బిరుదురాజు ప్రమీలరాణి గారు *రామచంద్రుడు* శీర్షికతో అయోధ్యపుర మహారాజు . దశరథ, కౌసల్య సుమిత్ర దయకేయుల ముద్దుల కుమారుడు అంటూ ప్రారంభించి రామచంద్రుని బాల్యం వివరిస్తూ చంద్రుని కావాలని అడగడం ప్రస్తావిస్తూ రామచంద్రునిగా అప్పటినుండి పిలవబడుతున్నాడు అంటూ వ్రాసిన మీ కవిత ఆ రామచంద్రుణ్ణి చూపించింది. ఒకేపదాన్ని విరిచి
రాస్తున్నారు. గమనించుకుని వ్రాయండి. ధన్యవాదములు మరియు అభినందనలు.👏👏👏🌺🌺🌺🙏🙏🙏
[30/12, 7:31 PM] +91 96033 89441: మహతి సాహితీ కవి సంగమం
ధనుర్మాస కవితోత్సవం
తేదీ-30- 12-2024
శీర్షిక- మార్గశిరం
ప్రక్రియ-కందపద్యం
కవితా సంఖ్య _13
కవిసంఖ్య 33
పేరు.జి.లింగేశ్వర శర్మ
61కం.
నేమము తోడను నిత్యము
మేమంతయు వేడుకొనగ మేదిని యందున్
క్షేమముల నొసగి సతతము
మా మదిలో నిలిచి పొమ్ము మధుసూదనుడా!
62.
కం.
వినుతించుచు మీ కీర్తన
మనసారగ వేడుకొనగ మార్గశిరములో
మనమున మోదము గూర్చుచు
మనుగడ సాగింప జేయు మధుసూదనుడా!
63
కం.
వినగోరుచు సత్కథలను
వినయముగా సాగుచుండు విశ్వము నందున్
ఘనమగు కీర్తిని పొందగ
మనుజుల నడిపించు మయ్య!మధుసూదనుడా!
64.
కం.
నిత్తెము కొలువగ భక్తులు
చిత్తము నీయందు నిలిపి స్థితిపథ మందున్
ముత్తెమువలె కొనసాగగ
మత్తును తొలగింప జేయు మధుసూదనుడా!
65.
కాలము వ్యర్థము జేయక
మేలిమి ముత్యముల వోలె మేదిని యందున్
మేలగు రీతిన సాగగ
మాలిన్యము రూపుమాపు మధుసూదనుడా!
స్వీయరచన
[30/12, 7:31 PM] Y Vara Lakshmi: *17*
శ్రీమతి అద్దంకి లక్ష్మీ గారు *శుక్రేశ్వర ఆలయం* గురించి బ్రహ్మపుత్రా నది ఒడ్డున కొలువై యున్నాడని వివరించారు. నేను ఇప్పుడే తెలుసుకున్నాను ఈ ఆలయం గురించి. బాగుందండీ వివరణ.
*అహోం* కరెక్టు కాదేమో...ఇలాటివి సరిచేసుకోండి. వచనము పాళ్ళు కాస్త తగ్గించి, కవీత్వకరించి రాస్తే మీ రచనకు ఘనత కదా! ధన్యవాదములు మరియు అభినందనలు.👏👏👏🌺🌺🌺🙏🙏🙏🙏
[30/12, 7:34 PM] +91 83907 05200: మహతీ సాహితీ కవిసంగమం
ధనుర్మాస కవితోత్సవం-2024
తేదీ: 30-12-2024.
శీర్షిక: సర్వమంగళా!
కవిత సంఖ్య:15.
కవిపేరు:టి. వి. యెల్. గాయత్రి.
కవిసంఖ్య:20.
ప్రక్రియ :పద్యము (చంపకమాల )
దరిసెనమీయవే శుభద!దైవము నీవని నమ్ముకొంటి!నా
బరువులు బాధ్యతల్ కనుమ!భారము నొందితి నీ జగంబులో
పరువుగ సాగు జీవనము వాసిగఁ గోరితినమ్మ శాంభవీ!
తెఱువును జూపవమ్మ!యుమ!తీరుగ కొల్చెద సర్వమంగళా!/
హామీపత్రం :పై పద్యము నా సొంత రచన అని హామీ ఇస్తున్నాను.
[30/12, 7:36 PM] L Vani Sarojini: మహతీ సాహితీ కవిసంగమం
ధనుర్మాస కవితోత్సవం
30 12 24 సోమవారం
అంశం ఐఛ్ఛికం పద్యములు తేటగీతి
శీర్షిక కార్య శూర హనుమాన్
క్రమసంఖ్య 24 కవితా సంఖ్య 15
వాణి సరోజిని లక్కరాజు
56
కలత జెందుచు నలుదిశల్ గలయజూచు
రమణి నీమెను జూడగా రామచంద్రు
సతియె , ననియెంచి మారుతి సంతసించె
హనుమ మించిన శూరుండు నవని గలడె ?
57
భర్త నెడబాసి విరహంపు బాధ తోడ
మాటి మాటికీ నిట్టూర్చు మానిని గన
పవనసుతుడు దలచె రామ పత్నిగను
హనుమ మించిన శూరుండు నవనిగలడె
58
భీకరాకారములదాల్చి భీతి గొలుపు
దానవులమధ్య బేలయై గానవచ్చు
మాన్యవతియగు మైధిలిన్ మారుతిగనె
హనుమ మించిన శూరుండు నవని గలడె
59
తరువు యాకులమాటున దాగి హనుమ
చివరి ఝామున రాత్రిలో శ్రేష్ఠములగు
వేద ఘోషలు మంగళ వాద్యమువినె
హనుమ మించిన శూరుండు నవని గలడె
స్వీయరచన
[30/12, 7:37 PM] Y Vara Lakshmi: *18*
శ్రీమతి పి. పద్మావతి గారు *వృద్ధాప్యం* శీర్షికతో వృద్ధాప్యంలోని బాధలను, కష్టాలను తలచుకుని భయపడకుండా, ధైర్యంతో స్థైర్యంగా జీవితాన్ని గడుపుతూ నలుగురికీ ఆదర్శంగా ఉండాలి అంటూ సందేశాత్మకంగా రాసిన మీ కవిత బాగుంది. ధన్యవాదములు మరియు అభినందనలు.👏👏👏🌺🌺🌺🙏🙏🙏
[30/12, 7:37 PM] +91 83280 79336: మహతీ సాహితీ కవి సంగమం
ధనుర్మాస క-2025వితోత్సవం
30/12/2024,సోమవారం
అంశం..ఐ చ్చి కం
తాతపూడి సోమశేఖర శర్మ
కవిత సంఖ్య..10
కవి సంఖ్య..81
శీర్షిక..డొక్కాసీతమ్మగారు
సుప్రసిద్ధమైన తూర్పు గోదావరి జిల్లాలో
ప్రేమానురాగాలమండపేటపట్టణగ్రామంలో
భవానీ నరసయ్య పుణ్య దంపతులకు
డొక్కా సీతమ్మ గారి పవిత్ర జననము
తరిగొండ వెంగమాంబ ఒకవైపు
డొక్కా సీతమ్మగారు రెండోవైపు
అన్నపూర్ణదేవిగా ప్రసిద్ధిఐనమాతలు
చరిత్రలోనిలిచిపోయినఅన్నదాతలు
లంక గంగవరం గ్రామ నివాసి సాత్వికుడు
జోగన్న అనే బ్రాహ్మణ వంశ నామధేయుడు
డొక్కాసీతమ్మగారికి పూజ్య పతిదేవులు
జాతకాలు చెప్పుటలోప్రావీణ్యులు
భార్యకు చేయూతగా నిలిచిన గొప్ప దాత
సహధర్మచారిణిడొక్కాసీతమ్మమాటవేదవాక్కు
కాశీఅన్నపూర్ణామాత,విశ్వేశ్వరస్వామిలా
భార్యాభర్తల ఇరువరి అభిప్రాయాలు ఒక్కటే..
ఏయాత్రికులకైనాభోజన మిచ్చేఏకోభిప్రాయం ఆనందంతోనేతినివెళ్లేయాత్రికసమూహగణం
లంకగన్నవరం వచ్చే యాత్రికులందరిపాలిట
ప్రేమానురాగాలతోకలబోసిన పాకశాలవంట
రుచికరము,రంజైనవంటకాలవిందుభోజనం
అక్షయపాత్రలాలేదనకుండాపెట్టే ప్రేమసత్రము
ఆనాటిఅన్నదానడొక్కాసీతమ్మగారిదాతృత్వం
ఈనాటికీసీతమ్మగారిపేరుఆచoద్రతారార్కమే..
హామీ పత్రం
ఈ కవిత నా స్వీయరచన అని హామీ ఇస్తున్నాను
[30/12, 7:38 PM] K Padma Sreevasthsav: *మహతీ సాహితీ కవిసంగమం*
*ధనుర్మాస కవితోత్సవం-2024*
*తేదీ: 30-12-2024*
*శీర్షిక:* ఆముక్త మాల్యద
*కవితా సంఖ్య:*7
*కవిపేరు: కోన.పద్మావతి*
*కవి సంఖ్య:*140
*ప్రక్రియ*: పద్యం
ఆటవెలది:
తులసి వనము నందు దొరికిన దేవేరి
వెలసి నావు లక్ష్మీ విభవ మలర
కలసి చెలుల తోడ కన్నయ్య పూజించి
కేల పట్టినావు కేశవుడిని!
రంగ నాధు కొరకు రమ్యమాలలుకట్టి
పొంగుభక్తి తోడ పూలు దాల్చి
కొంగుబంగ రముగ కొలిచితి నీవంట
కొంగు కట్టితివట కోరి పతిగ !
పట్టు పట్టి నాడు పతిగాను రంగడు
విష్ణు చిత్తు డయ్యె విష్ణు మామ
పెట్టి నట్టి మాల పెరుమాళ్ళు చేకొని
కట్టు కొనెను సామి కన్నె నపుడు!
*హామీపత్రము:*ఇది నా స్వీయ రచన అనిహామీ ఇస్తున్నాను
[30/12, 7:38 PM] Y Vara Lakshmi: *19*
శ్రీ తిరుమల మనోహరాచార్యులు గారు *ధనుర్మాసం* శీర్షికతో గోదాదేవి పాశురాలు భావం చక్కగా వివరించారు. ముందే లేచి అందరినీ మేల్కొలుపుతానన్నావే గోపికా! మునులు ఆలయంలోకి వెళ్తున్నారు. లేవమ్మా...అంటూ ఆ కన్నయ్యను వర్ణిస్తూ రాసిన మీ కవిత బాగున్నది . ధన్యవాదములు మరియు అభినందనలు.👏👏👏🌺🌺🌺🙏🙏🙏
[30/12, 7:38 PM] Iluri Vedha Kumari: మహతీ సాహితీ కవిసంగమం
ధనుర్మాస కవితోత్సవం -24
తేదీ :30/12/2024
శీర్షిక :హరి స్తుతి(ఇష్టపది -15)
పేరు :పోగుల భాగ్యలక్ష్మి
ధనుర్మాస కవి సంఖ్య :38
కలి ప్రభావంబుచే గతి మతియు దప్పంగ
శమీకుని మెడలోన చచ్చిన సర్పంబును
పట్టి వేసెనుగాదె పరీక్షిత్ మహరాజు
ఆగ్రహించిన శృంగి యతని శపియించెనుగ
మరణ మాసన్నమవ మదిన హరినే నిలిపి
హరికధలు వినినంత యతని దరి జేర్చుకొని
శ్రవణ భక్తి మహిమను చాటి జెప్పినవాడ
కరుణించి గావరా కమలనాభుడ హరీ
(ఇది నా స్వీయ రచన )
[30/12, 7:41 PM] Satyam Mastaru: మహతి సాహితీ కవిసంగమం
ధనుర్మాస కవితోత్సవం
సోమవారం 30-12-2024
కృష్ణ లీలలు (రుక్మిణీ కళ్యాణం) ఇష్టపది 1️⃣5️⃣
ముక్కా సత్యనారాయణ 2️⃣8️⃣
తుమ్మెదల పోలినవి, తెమ్మెరల ముంగురులు.
అనుంగు చెలి హస్తము, ఆదరువుగ పట్టిన
వాడి తూపుల వోలె, సుందరమైన చూపులు,
కండల వీరులకున్,గుండెలను చెండేయ,
గజగామిని రుక్మిణి, కదిలింది గుడి నుంచి.
చేష్టలుడిగి యువకులు జూసుచుండగ, పడతి
ముకుందుని తలుస్తూ, ముందుకే కదిలింది.
కమనీయ గాథలను కమ్మగా వినరండి.
ఈ రచన నా స్వీయరచన అని తెలియచేస్తున్నాను.
[30/12, 7:43 PM] Y Vara Lakshmi: *20*
శ్రీమతి మైలవరపు వెంకట పద్మావతి గారు *గోప బాలికలు* శీర్షికతో పుండరీకాక్షుని పూజించుటకు రండి ఓ గోపికలారా అంటూ గోదాదేవి పాశురాన్ని అనువదించారు. *మీ ఆలోచన బాగుందమ్మా! వ్యక్తీకరణలో కాస్త శ్రద్ధ వహించాలి మీరు.. అప్పుడు కవిత బాగుంటుంది. అలా ప్రయత్నించండమ్మా*!ధన్యవాదములు మరియు అభినందనలు.👏👏👏🌺🌺🌺🙏🙏🙏
[30/12, 7:55 PM] Geeta Kumari: మహతీ సాహితీ కవిసంగమం
ధనుర్మాస కవితోత్సవం-2024
తేదీ: 29-12-2024
అంశం:ఐచ్ఛికం
శీర్షిక:భక్తిసుధ
ప్రక్రియ:ఇష్టపది
కవితాసంఖ్య:14
బత్తిన గీతాకుమారి
కవిసంఖ్య:43
26.
నవవిధ భక్తిఁదెలుపు నాల్గవ గోపెమ్మా!
నేర్పగ జ్ఞానమునే నేర్పరి నీవమ్మా!
గోష్టిన జేరి పంచు గోపిక భక్తి రీతి
మంత్రించబడితివా మగువ నిదుర దేలవు.
నా ప్రభునిపొందులో నాదమరచినావా
మణిమయవాసము విడి మముచేరరా సఖీ!
దీపధూపములెగియ దేవుని కడనుంటివె
సన్నిధి నుండి విడచి శయ్యనొదలి రావా!
27.
కిట్టుని నామావళి కీర్తించెదము చెలీ
వినబడలేదా చెలి వేణుగాన భజనలు.
పరమాత్మ సేవకు పరధ్యానమేలా
పరిమళ ద్రవ్యాలే పడతియునికి తెలిపెను.
మాధవు చెంత బిడ్డ మారాడకయుండును
మణిమయ గృహము వీడి మాతో చేర రావ.
భవ్యస్నానము జేసి భక్తితో గొలిచెదము
బదులిడు గోపకాంత పరుగున రమ్మంటిని.
హామీపత్రము: ఇది నా స్వీయరచన
[30/12, 7:57 PM] +91 94401 45495: మహతీ సాహితీ కవి సంగమం
ధనుర్మాస కవితోత్సవం
తేదీ: 30-12-2024
శీర్షిక:పాశురము(15)
ప్రక్రియ: పద్యం - ఆటవెలది
కవి పేరు: గవిచర్ల వెంకట దుర్గా ప్రసాద్ శాస్త్రి (సంఖ్య:25)
@@@@@@@@@@@@@@
ఆ.
ఇంత మొద్దు నిద్ర యింతి నీ కేలనే
చిలుకలకొలికి యన, నలుక బూని
పల్కె నిష్ఠురముగ.."వచ్చుచున్నా
నన",
కఠిన మాటలేల కలువ కంటి...!!!
ఆ.
అనుచు, బయటి వారు నాత్మీయ
ముగపిల్చె
తరలి పోవ రావె తరళనయన
కూర్మి నిచ్చువాడు కువలయాంతకు
డును
తృష్ణ తీర్చు వాడు కృష్ణుడతడు...!!
....పై పద్యాలు నా స్వీయ రచన...!
@@@@@@@@@@@@@@
[30/12, 8:00 PM] +91 96665 17365: మహతీ సాహితీ కవిసంగమం
ధనుర్మాస కవితోత్సవం-2024
తేదీ: 30/12/2024
శీర్షిక: గోదాదేవి పిలుస్తుంది! గోపికలు రారండి!
కవిపేరు: కుంతీపురం మాధవీ లత
ప్రక్రియ: వచన కవిత
కవిత సంఖ్య: 15
క్రమ సంఖ్య : 5
*******************************
పదిహేనవ రోజు గోదాదేవి మంచి మాటకారి అయినా గోప బాలికను మేల్కొల్పుతుంది.
ఓ లేత చిలుక!
చమత్కారంగా మాట్లాడే చిలుక!
నేర్పరిగ మాట్లాడే నెరజాణవు నీవు
చిలిపిగా మాట్లాడే చిలక పలుకుల పిల్ల
నీ పుల్లవిరుపు మాటలు మాకు తెలుసు
మేమందరమువచ్చాము లేచి రావమ్మా !
వచ్చి లెక్క చూసుకో అని పదవ గోప బాలికను లేపుతోంది అమ్మ
అప్పుడు గొప్ప బాలిక!
పూర్ణులైన పూబోడులారా!
చెవులు గడియలు పడునట్లు గట్టిగా పిలవకండి
రావలసిన రమణులంతా వచ్చి యున్నారా?
నేను లేచి వచ్చాను మీకై నేనేమీ చేయాలి.
కంసుని గజముని సంహరించిన వాడు
కంసాది శత్రువులను సంహరించిన వాడు
కృష్ణుని గుణ కీర్తనలు కీర్తించుదాము
అంటూ చేర్చుకునిరి మాటకారి భామను.
హామీ పత్రం: ఇది నా స్వీయ రచన
[30/12, 8:00 PM] +91 98401 89105: మహతీ సాహితీ కవిసంగమం
ధనుర్మాస కవితోత్సవం-2024
తేదీ: 30-12-2024
శీర్షిక: పెరుమాళ్ సాక్షాత్కారము
కవితాసంఖ్య: 15
కవిపేరు: డాక్టర్ కురవి వేంకట కృష్ణశాస్త్రి
కవిసంఖ్య : 3
ఇష్టపది:
గగన సీమ నందున, గరుడ వాహనంబున,
నాల్గు భుజముల తోడ, నవ్వుల మోము తోడ,
పీతాంబరముఁ గల్గి, పీయువు నగలు గల్గి,
శంఖు చక్రంబులను శయము నందున గల్గి,
కస్తూరి తిలకంబు కమనీయముగ గల్గి, నీలమేఘ శ్యాముడు, నీరేరుహోదరుడు
సతీ లక్ష్మీ దేవి సమేతంబుగ వచ్చి
దర్శన మిడె జనులకు తఱుసంటిగా "కృష్ణ"!!
హామీపత్రము: ఇది నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను.
[30/12, 8:05 PM] +91 97034 83648: మహతీ సాహితీ కవిసంగమం
ధనుర్మాస కవితోత్సవం-2024
తేదీ: 30-12-2024
శీర్షిక: *పాలిథీను -15*
కవిపేరు: మహేంద్రాడ సింహాచలాచార్య
(టెక్కలి)
ధనుర్మాస కవి సంఖ్య: 19
*పాలిథీను -15*
(పద్య కవిత)
61.
కొండచిలువ భంగి కోరజాచియు మ్రింగ
వివిధ రూపములుగ వెలయు చున్న
"హాన్సువాను" సృష్టి హరియించు భూతమ్మె
ప్రళయ మిలకి దెచ్చు పాలిథీను!
62.
ఇల సునామికంటె నిదియె తీవ్రతరమ్ము
పక్షి జాతి నడచి ప్రబలుచుండె
జనులునుద్యమించి జాగృతించకనుండ
ప్రళయ మిలకి దెచ్చు పాలిథీను!
హామీపత్రము:
పై *పాలిథీను శతకం - 15(ఆటవెలది పద్యాలు)*
స్వీయ రచన
[30/12, 8:08 PM] G Satyanarayana: మహాతీ కవి సంగమం
ధనుర్మాస కవితోత్సవం-2025
30/12/2024,సోమవారం
అంశం: ఐచ్చికం
శీర్షిక,: ఆండాళ్ విశిష్ఠత
గజవెళ్లి సత్యనారాయణ స్వామి
కవిత:8
కవి సంఖ్య57
*****************************
ఆండాళ్ అంటే గోదమ్మ తల్లి
ఆమె మానవ జీవనాన్ని
గురించి తెలుపుతూ
వారు దానికై సాదనముగా
స్వీకరించాలని దాని ఫలింప
జేసేవారు భాగవద్భక్తులు.
వారివల్ల లభించే
సదాచార్యులు
వారివల్ల లభించే భగవన్మంత్రం,
ఆ మంత్రంచే మన మనస్సులను ప్రభావితం
చేయుచు ఇక్కడ
అక్కడ గూడ సుఖానుభవముల
నివ్వజాలిన
శ్రీ దివ్య మంగళ విగ్రహమును
దాల్చిన ఆర్చామూర్తి
అనే విషయాన్ని
శ్రీ ఆండాళ్ 30 దినములలో
ధనుర్మాస వ్రతము తాను ఆచరించి
అందమైన ,
సర్వ వేదాంత సారమని
పాడి లోకాన్ని "తిరుప్పావై"
పాశురాలను మనకు అందించే
ఆ అమ్మ!
ఇది నా స్వానుభవ కవిత
[30/12, 8:28 PM] Guru Murthy: బాగుందండి
అభినందనలు
ధన్యవాదాలు
[30/12, 8:30 PM] Guru Murthy: వెన్నల
బాగుందండి
అభినందనలు
ధన్యవాదాలు
[30/12, 8:32 PM] Guru Murthy: వచ్చినాము అని వాడరాదు
బాగుందండి
అభినందనలు
ధన్యవాదాలు
[30/12, 8:34 PM] Guru Murthy: బాగుందండి ఇంకా కుదరాలండి
అభినందనలు
ధన్యవాదాలు
[30/12, 8:36 PM] Guru Murthy: చుందురే ఇలా ఏ వాడరాదు( చుందురు)
బాగుందండి
అభినందనలు
ధన్యవాదాలు
[30/12, 8:37 PM] Guru Murthy: బాగుందండి ఇంకా కుదరాలి
అభినందనలు
ధన్యవాదాలు
[30/12, 8:38 PM] Guru Murthy: బాగుందండి ఇంకా కుదరాలి
అభినందనలు
ధన్యవాదాలు
[30/12, 8:39 PM] Guru Murthy: మాధవుని
బాగుందండి
అభినందనలు
ధన్యవాదాలు
[30/12, 8:45 PM] Guru Murthy: తానును నిష్ట ఇలా సంధి చేయరాదు
భోజనం మనకు ఇలా పూర్ణం ఉంచరాదు
బాగుందండి ఇంకా కుదరాలి
అభినందనలు
ధన్యవాదాలు
[30/12, 8:46 PM] Guru Murthy: నమ్మను
బాగుందండి
అభినందనలు
ధన్యవాదాలు
[30/12, 8:48 PM] Guru Murthy: బాగుందండి ఇంకా కుదరాలి
అభినందనలు
ధన్యవాదాలు
[30/12, 8:49 PM] Guru Murthy: తీరుగ గ్రామ్యం
బాగుందండి
అభినందనలు
ధన్యవాదాలు
[30/12, 8:49 PM] Y Vara Lakshmi: *21*
శ్రీమతి యంజాల అన్నపూర్ణమ్మ గారు *కృష్ణ భాగవతం*. శీర్షికతో విదురునకు మైత్రేయుడు తెలిపెను అనుచు ప్రారంభించి...వరాహావతారం ధరించి హిరణ్యాక్షుని వధించి భూమిని ఉద్ధరించిన విధము చక్కగా వివరించారు. ధన్యవాదములు మరియు అభినందనలు.👏👏👏🌺🌺🌺🙏🙏🙏
[30/12, 8:50 PM] Y Vara Lakshmi: *22*
శ్రీ డి టి హేమంత్ సింగ్ గారు *నవీన మార్గాన్ని* శీర్షికతో కవికి పరిశుభ్రత, ఆరోగ్యం గురించి తెలియజేయ వలసిన బాధ్యతను గుర్తుచేస్తూ రాసిన మీ రచన బాగుంది. ధన్యవాదములు మరియు అభినందనలు.👏👏👏🌺🌺🌺🙏🙏🙏
[30/12, 8:50 PM] Guru Murthy: బాగుందండి
అభినందనలు
ధన్యవాదాలు
[30/12, 8:51 PM] Y Vara Lakshmi: *23*
శ్రీ తాడిపూడి సోమశేఖర శర్మ గారు *డొక్కా సీతమ్మ* శీర్షికతో రాసిన మీ రచన బాగుంది. ధన్యవాదములు మరియు అభినందనలు.👏👏👏🌺🌺🌺🙏🙏🙏
[30/12, 8:52 PM] Guru Murthy: లక్ష్మి
బాగుందండి ఇంకా కుదరాలి
అభినందనలు
ధన్యవాదాలు
[30/12, 8:53 PM] Guru Murthy: బాగుందండి ఇకా కుదరాలి
అభినందనలు
ధన్యవాదాలు
[30/12, 8:54 PM] Guru Murthy: బాగుందండి ఇంకా సాధన అవసరం
అభినందనలు
ధన్యవాదాలు
[30/12, 8:59 PM] Y Vara Lakshmi: మహతి సాహితీ కవి సంగమం
ధనుర్మాస కవితోత్సవం-2024
తేదీ: 30-12-2024(సోమవారం)
అంశం: గోదా చరితం
శీర్షిక: నారాయణ నామస్మరణం ముక్తిదాయకం
ప్రక్రియ: వచన కవిత
పేరు: జన్ను ఈశ్వరమ్మ
ధనుర్మాస కవి సంఖ్య: 14
కవితా సంఖ్య: 15
*****************************
లేప్రాయపు తీరము వలె
స్వరము కలిగిన చక్కని చుక్క
మొద్దు నిద్ర మాని లేచి రావే
వద్దని నేను వీడి వెళ్లక
మనమంత కలిసి మంగళకరమగు
మాధవుని సేవకు తరలుదామని
వచ్చితిమే నీ చెంతకు
మా మధురవాక్కుల పిలుపులు
నీకు కర్ణ కఠోరమాయెనా
నీదు మృదుభాషణ చమత్కారం
మాకేరుకయే చెలీ
మీ గుణగణములు నాకు
అంటగట్ట కండి సుమా
సుగుణాల రాశులరా
సుందర వదనులారా
కువలయమను గజమును
అవలీలగ అంతము చేసినవాడు
కంస మామను తుద ముట్టించిన
తుల లేని ధీరుని గుణగణములు
మనమంతా కలిసి కీర్తించుదము తరలిరావే తరుణి
అందరమొక్కటిగ కలిసుంటేనే
ఆనందం సుమీ
సహనముంటే సాధ్యము కానిది లేదు కదా
భాగవతోత్తముల సహవాసం
ఆగము కానీయదు ఎవరి జీవనమైనా
నవవిధ భక్తులలో నవ్యమైన మార్గమిదే
నవనవోన్మేష భావనతో నిరంతరం నారాయణ నామ సంకీర్తనయే
భవబంధమోచనకరము
భక్తి ముక్తి సుధాదాయకం
************************
హామీ: స్వీయ రచన.
[30/12, 8:59 PM] Y Vara Lakshmi: *మహతీ సాహితీ కవిసంగమం*
*ధనుర్మాస కవితోత్సవం*
ఈవారం కవితాసంఖ్య:..15
తేది:....30-12-24.సోమవారం
శీర్షిక:.....గోదాకళ్యాణం
ప్రక్రియ...పద్యం(71-75)
కవిపేరు...పద్మ చిగురాల.
మహతీ సాహితీ సంఖ్య...21
*కలికిచిలుకవీవు కంఠంబు మధురంబు*
*నిండు హృదయ గరిమ నీదు మాట*
*కాస్త కఠినమైన కారుణ్యమూర్తివి*
పద్మ పద్యవంద్య వాసుదేవ
*నిదుర విడచి వచ్చి నీచెంతనుంటిమి*
*వేచియుంటిమమ్మ వేగరమ్ము*
*గడుసుదనమునాపి కలిసివెడలెదము*
పద్మ పద్యవంద్య వాసుదేవ
*మత్తగజపుకుంభ మదమణచినవాని*
*గుణగణములు గొలువ కోర్కెదీరు*
*నరగవలయునమ్మ హరిని కీర్తించగా*
పద్మ పద్యవంద్య వాసుదేవ
మధురలోనపుట్టె మాయావి కృష్ణుండు
గోకులమున పెరిగె కూర్మితోడ
కష్టములనుదీర్చి కంసునిపరిమార్చె
పద్మ పద్యవంద్య వాసుదేవ
ఉత్తమ గురువులిడు నుపదేశములవిని
సాగిపోదమిపుడుసరళమతిని
భక్తజనులు పూర్ణ భగవత్స్వరూపులు
పద్మ పద్యవంద్య వాసుదేవ .
హామీ పత్రం:స్వీయరచన.
[30/12, 9:11 PM] Y Vara Lakshmi: *24*
శ్రీమతి కుంతీపురం మాధవీలత గారు *గోదాదేవి పిలుస్తుంది! గోపికలూ!* శీర్షికతో పదిహేనవ రోజు గోదాదేవి మాటకారి గోపికను మేలుకొలుపుట గురించిన రచన బాగుంది. ధన్యవాదములు మరియు అభినందనలు.👏👏👏🌺🌺🌺🙏🙏🙏
[30/12, 9:12 PM] Y Vara Lakshmi: *25*
శ్రీ గజవెళ్ళి సత్యనారాయణ స్వామి గారు *ఆండాళ్ విశిష్టత* శీర్షికతో ఆండాళ్ తల్లి రచించిన పాశురాల విశిష్టతను తెలియజేస్తూ రాశారు. బాగుంది. కానీ చివరి నిముషంలో సమూహంలోనే హడావిడిగా టైపు చేయకుండా....నిదానంగా అక్షర దోషరహితంగా రాసుకుని, సరిచూసుకుని పంపగలరు. ధన్యవాదములు మరియు అభినందనలు. 👏👏👏🌺🌺🌺🙏🙏🙏
[30/12, 9:16 PM] Y Vara Lakshmi: *26*
శ్రీమతి జన్ను ఈశ్వరమ్మ గారు *నారాయణ నామస్మరణం ముక్తి దాయకం* శీర్షికతో ఓ చక్కని చుక్కా.,,మాధవుని సేవకు వేళాయెను నిద్దురలేవే ఓ చిలుకా! అంటూ పరస్పరం మాటలాడడం మాధవుని గుణగణాలను వర్ణించడం బాగుంది. ధన్యవాదములు మరియు అభినందనలు.👏👏👏🙏🌺🌺🌺🙏🙏🙏
[30/12, 9:19 PM] Guru Murthy: బాగుందండి
పద విభజన చేయాలి
అభినందనలు
ధన్యవాదాలు
[30/12, 9:23 PM] Y Vara Lakshmi: మహతీ సాహితీ కవిసంగమం
ధనుర్మాస కవితోత్సవం-2024
తేదీ: 30-12-2204
శీర్షిక: శ్రీరామ శతకం
(సీతారామ కళ్యాణం)(15)
కవిపేరు: వరలక్ష్మి యనమండ్ర (35)
ప్రక్రియ: ఆటవెలది
71.
సూర్య వంశ ప్రభువు శోభిల్లు సగరుడు
భార్యలిద్దరుండె వైభవముగ
సంతు కొరకు జూడ సంతాపము గలిగె
ననుచు రాముని కథ నల్లుచుంటి!
72.
పెద్ద భార్య కొడుకు పేరంశుమంతుడు
చిన్నభార్య సుతులనెన్న వేలు
అశ్వమేధయాగమందు కష్టము వచ్చె
ననుచు రాముని కథ నల్లుచుంటి!
73.
ఇంద్రలోకమందు నింద్రుడు గోపించి
యశ్వమేధమునకు నడ్డుతగిలె
యాగమాపదలచి యాగాశ్వమును దాచె
ననుచు రాముని కథ నల్లుచుంటి!
74.
అశ్వమును వెదకుచు నటు వెడలె భటులు
పోయిరంట రాజ పుత్రులంత
చిన్నరాణి సుతులు జేరిరి యటవిని
యనుచు రాముని కథ నల్లుచుంటి!
75.
ఆమె సుతుల సంఖ్య యరువది వేలుండె
నతిశయంబు తోడ నవని దిరిగి
పరుగుబెట్టి జొచ్చె పాతాళ లోకంబు
ననుచు రాముని కథ వ్రాయుచుంటి!
హామీపత్రము:
[30/12, 10:12 PM] Porla Venu Gopala Rao: మహతీ సాహితీ కవిసంగమం
ధనుర్మాస కవితోత్సవం-2024
తేదీ: 30-12-2204
శీర్షిక: రాఘవేంద్ర శతకం (15)
కవిపేరు: పొర్ల వేణుగోపాలరావు(37)
ప్రక్రియ: ఆటవెలది
(71)
భక్తి ఉద్యమమున పరిమళించిన వారు
పరమ యోగి యతడు వాసుదేవ
యనెడి పేరు నుండి యానంద తీర్థులు
రాఘవేంద్రుని కథ వ్రాయుచుంటి!
(72)
విజయ దశమి నాడు వీరు జన్మించిరి
యుడిపిలోన జనులనుద్దరించ
తల్లి వేదవతియు తండ్రి నారాయణ
రాఘవేంద్రుని కథ వ్రాయుచుంటి!
(73)
పిదప వాసుదేవ పేరును మార్చగా
క్రొత్త పేరునిచ్చె గురువు తనకు
నపుడు పూర్ణ ప్రజ్ఞ యానంద తీర్థులు
రాఘవేంద్రుని కథ వ్రాయుచుంటి!
(74)
అతను దెల్పిరంట యైదు నిర్వచనాలు
జీవునకును మరియు దేవునకును
నుడివె దానితోడను పదార్థ భేదముల్
రాఘవేంద్రుని కథ వ్రాయుచుంటి!
(75)
మూడు మతములందు ముచ్చటగా యొదిగి
వరలె తాను భువిన ద్వైత మతము
బహు ప్రసిద్ధి నొందె భక్తియుద్యమమందు
రాఘవేంద్రుని కథ వ్రాయుచుంటి!
హామీపత్రము: స్వీయరచన
[30/12, 10:31 PM] Sadayya: మహతీ సాహితీ కవిసంగమం
ధనుర్మాస కవితోత్సవం-2024
30-12-2024 మేలుకొలుపులు(మత్తకోకిల)
కవితా సంఖ్య: (09)
డా.అడిగొప్పుల సదయ్య (61)
09.
రేడు కుంకెను,తెల్లవారెను,రేగె మిత్రుడు తూర్పునన్
మోడుబారిన బీడు బెర్గిన మోదుగాకుల దొన్నెలో
కూడి దాగిన మంచుగడ్డలు కూలి నీరయె,మాధవా!
మేడకుండ్లము,మమ్ము కాచగ,మేలుకో, ధరనేలుకో!
నిఘంటువు:
కుంకెను= అస్తమించెను
రేగె= పైకెగిసెను
మిత్రుడు= సూర్యుడు
మేడకుండ్లము = అమాయకులము
కాచగ= కాపాడుటకు
పై పద్యాలు నా స్వీయరచన అని హామీ ఇస్తున్నాను.
అడిగొప్పుల సదయ్య
[31/12, 5:00 AM] Guru Murthy: నడ్డుపడియె
పుత్రులెల్ల
బాగుందమ్మా!
అభినందనలు
ధన్యవాదాలు
[31/12, 5:06 AM] Guru Murthy: యుద్యమమున
పేరు నుండి భావదోషం ( పేరుఁ గల్గి)
నుద్దరింపఁ
దల్లి
బహు ప్రసిద్ధి గణదోషం
(ఏక పదములోగాని ఏక సమాస పదములోగాని ఉన్న ద్విత్వ, సంయుక్తాక్షరములకు ముందున్న అక్షరం గురువు)
బాగుంది ఆర్యా!
అభినందనలు
ధన్యవాదాలు
[31/12, 5:10 AM] Guru Murthy: (మమ్ము గాయగ)
మేలుకో!
, గుర్తులు మొత్తం వద్దు ఆర్యా
బాగుంది
అభినందనలు
ధన్యవాదాలు
Comments
Post a Comment