Dhanurmasam 31-12-2024

[31/12/2024, 8:10 AM] Kadali Prakash Rao Prakash: మహాతీ సాహితీ కవి సంగమం ధనుర్మాసకవితోత్సవం 2024. తే 31-12- 2024 ది పాశురము - 16. తిరుప్పావై శీర్షిక : శ్రీదేవి కొలువుకు ప్రక్రియ : ఇష్టపది - 16. కవిపేరు : డాక్టర్. కడలి ప్రకాశరావు కవిసంఖ్య : 8 ఇష్టపది ******** ప్రభవిం lచిన వేకువ ప్రవిమల ప్రభాతమూ గోపికలబృందమూ గోమాత పూజలు శ్రీకృష్ణ దర్శనార్ధం శ్రీదేవికి వ్రతము మామనసులుస్వచ్ఛం మాయ మర్మము లేదు అనిచెప్పినంతనే అన్ని తలుపులు తెరచి స్వాగతించినభటులు సానుకూలము గాను వాణీ నామనసున వర్ణింతు భక్తితో కడలి వారి మాటలు కల్లలు కాదెన్నడును!!! హామీ పత్రం : ఇది నాస్వీయరచన యని హామీ ఇస్తున్నాను. [31/12/2024, 8:29 AM] Bhargavi Peri: మహతీ సాహితీ కవి సంగమం. ప్రతిరోజూ కవితా పండగే. తేదీ : 31-12-24. మంగళవారం. అంశం : ధనుర్మాస వైభవం. శీర్షిక : గోదా పాశురం పద్యాలు. ప్రక్రియ : శార్దూల విక్రీడితం. పేరు : పేరి . భార్గవి. ఊరు : విశాఖపట్నం. కవిత సంఖ్య : 16. క్రమ సంఖ్య : 47. 17. ధర్మాధర్మ వివేకవేద్య ప్రజలన్ ధర్మమ్ముగా నేలి మా కర్మమ్మంతయు రూపు మాప గదవే కారుణ్య ధాముండవై ధర్మమ్మంతయు నేర్చినట్టి వనితా దామోదరున్ జేరవే మర్మమ్మంతయు వీడి వేగ కొలువన్ మాస్వామి శ్రీ రంగ నిన్. [31/12/2024, 9:00 AM] +91 88850 50822: మహతీ సాహితీ కవిసంగమం ధనుర్మాస కవితోత్సవం-2024 అంశము: ఐచ్ఛికం – స్వాతంత్ర్య సమరయోధులు ధ.క. కవితా సంఖ్య: 16 తేదీ: 31-12-2024 వారం: మంగళవారం శీర్షిక: రామ్‌జీ గోండ్ కవిపేరు: యేచన్ చంద్ర శేఖర్ కవి సంఖ్య: 16 ప్రక్రియ: వచనం గిరిజనుల స్వాతంత్ర్య పోరాటపటిమకు తెలంగాణ నెలవు రామ్‌జీ గోండు, కోలం, కోయ, నాయక్, పోడుల ఆదరువు బ్రిటిష్ మరియు నిజాం దళాలను ఎదుర్కొన్న ధీరుడు రామ్‌జీ గోండ్ తెలంగాణ స్వాతంత్ర్య సమరయోధుడు వేలాది గోండులు మరియు రోహిల్లాలను సమీకరించాడు సిపాయిల తిరుగుబాటులా గెరిల్లా పోరుకు తెగబడ్డాడు రామ్‌జీ సహా వెయ్యి మంది బ్రిటిష్ వారికి బందీలయ్యారు కసిదీర్చుకునేందుకు మర్రి చెట్టుకు వేళ్ళాడదీసి ఉరిదీసారు రామ్‌జీ గుర్తుగా నిర్మల్‌లో స్మారక స్థూపం నిర్మించబడింది గోండుల పౌరుషం, స్వాభిమానాలకు అది ప్రతీకగా నిలుస్తుంది అట్టి స్వాతంత్ర్య సమరయోధుల చరితను వెలికిదీసి అంజలి ఘటించ సంకల్పించినాడు చంద్రశేఖరుడు హామీపత్రము: ఇది నా స్వీయ రచన అని ధృవపరుస్తున్నాను [31/12/2024, 9:05 AM] T R K KAMESWARA RAO: మహతీ సాహితీ కవిసంగమం ధనుర్మాస కవితోత్సవం-2024 తేదీ: 31-12-2024 శీర్షిక: తిరుప్పావై పాశురము - 16 (గోదాదేవి విన్నపము) కవిత సంఖ్య: 16 కవిపేరు: తెలికిచెర్ల రాజ కృష్ణ కామేశ్వర రావు కవి సంఖ్య: 6 ప్రక్రియ: వచనం --------------------------------------- నిద్రలేపె ఆండాళ్ తల్లి పది మంది గోపికల గత పది పాశురము లందు చేసెను పది విజ్ఞానులు అనుగ్రహము మనపై పడునట్లు పోయెను నందగోప భవనమునకు పది మంది గోపికలతో ఆండాళ్ తల్లి నందగోపాలుడే మన ఆచార్యుడనుచు కాంచెను గరుడద్వజం యొక భవనము ముంగిట ఊహించెను అదియే కృష్ణ భవనమని శత్రువులు వస్తారని భీతితో, అప్రమత్తతతో కాపల కాచుచుండే ద్వారపాలకులు ప్రసన్నము చేసుకొనగోరి పోవుచుండె లోనికి గోపికలతో అనుమతి కోరే దారి విడువమని ద్వారపాలకుని కాంచి బాలగోపాలుడే రమ్మనమని చెప్పె మము వేకుజామునే వ్రతమునకై *అరై- పరై* పరికరములని ఇత్తునని సందేహము వలదు నీకు, తెలియవు మాకు మాయా మంత్రములు మేము శత్రువులము కాదు దయతో తెరువుము మణిమయ ద్వారములను శుచిగా స్నానమాడి వచ్చిన గోప బాలికలము నిరాశపరచకు మమ్ము ఆతని పవ్వళింపు చూచి మురిసిపోవుదుము బాల గోపాలుని నిద్ర లేపుదము అందరమూ కలసి ఆ కృష్ణుని స్తుతించి గానము చేసెదము ఓ చెలులారా! నిర్వర్తించుదము అందరము ఆ నారాయణ వ్రతమును శ్రద్ధగా అదియే మన అందరికీ రక్ష "సులభ మార్గమిదియే గోవిందుని సన్నిధి చేర!" హామీ పత్రము: ఇది నా స్వీయ రచన [31/12/2024, 9:26 AM] venky HYD: మహతీ సాహితీ కవిసంగమం ధనుర్మాస కవితోత్సవం తేది: 31-12-2024 (మంగళవారం) శీర్షిక: తిరుపావై (ప్రక్రియ-వచనము) కవిత సంఖ్య-11 కవి పేరు: కామవరం ఇల్లూరు వేంకటేష్ కవి సంఖ్య -60 వచనము ఓం నమో వేంకటేశ్వరాయనమః తిరుపావై పాశురాలు గోపన-గోపికల సంభాషణ ఈ పాశురం గోపికలు: చిలుక ఇంకను నిద్రిస్తున్నావా శీఘ్రముగా రావమ్మా; గోపన: ఇదిగో వస్తున్నా! చెవులు చిల్లులు పడేటట్లా మరి! గోపికలు: చమత్కారంగా మాట్లాడుతావే నీ పుల్ల విరుపు మాటలు మాకు తెలుసులే! గోపిస: మీరే అట్టి సమర్థులు, నేనేమి కాదు అయినా అందరు వచ్చి చేరినారా? వస్తున్నా! గోపికలు: కంసాది శత్రువులను సంహరించిన సర్వేశ్వరుడైన కృష్ణుని కీర్తింపగ రమ్ము వ్రతం పూర్తి చేసుకుందాం వెంటనే రమ్ము సుందరీ! గోపన: ఇదిగో వస్తున్నా! అందరితో చేరింది! వేం*కుభే*రాణి హామీ పత్రం: ఈ వచనము నా స్వంతమని తెలియ చేస్తున్నాను. [31/12/2024, 9:45 AM] BSN RAO: మహతీ సాహితీ కవిసంగమం! ధనుర్మాస కవితోత్సవం-2024. తేది: 31.12.2024. శీర్షిక: ఆండాళ్ తిరువడిగళే శరణం! కవిత సంఖ్య: 16. కవి: బాచిరాజు సత్యనారాయణ రావు, (బా. స.రా)(9) ప్రక్రియ: వచన కవిత. ****************************** ఓయీ! స్వామి వాకిట కావలి గాచెడు పరిరక్షకుడా! మేము వ్రేపల్లె గొల్ల పిల్లలము, పరిశుద్ధ మనస్సుతో కృష్ణయ్య దర్శనం చేసుకొనుటకు వచ్చాము. మణిమయ ప్రకాశమైన గడియ తీసి మమ్ము లోనికి పంపుము. స్వామికి హరేం దాసులము, పుట్టింది గొల్ల కులమే,అజ్ఞానులమే, కానీ స్వామి యందు అత్యంత ప్రేమానురాగం భక్తి ప్రపత్తులు కలవారం! బాబూ! మా మాట విను, సుప్రభాతం పాడి స్వామిని మేలు కొల్పాలి. అవును, గొల్లలమే,కానీ ఇంద్ర నీలమణి దేహ ఛాయ గల, స్వామి నిన్న మాకు పాశురం అనే ప్రార్థన అనుగ్రహించాడు. మరి స్వామిని కీర్తిస్తూ సుప్రభాత గానం చెయ్యాలి. కృష్ణ స్వామీ! నీవు వద్దని చెప్పకుము. కావలి వానిని, వెంటనే ద్వారం తెరువమని చెప్పుము. సుప్రభాత గానం చేసి నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించుము! ఇతి తిరుప్పావై షోడశ పాశుర ప్రార్థన శ్రీ గోదాదేవి విరచిత గానామృతం సర్వం శ్రీ రంగనాథ కృపా కటాక్షం! ఈ తిరుప్పావై పాశుర కవిత నా స్వీయ రచన. [31/12/2024, 10:25 AM] Ramakrishna: మహతీ సాహితీ కవిసంగమం ధనుర్మాస కవితోత్సవం-2024 తేదీ: -31/12/2024 శీర్షిక: పాశురాలు కవితా సంఖ్య:-15 కవిపేరు: మునగనూరి రామకృష్ణ ధనుర్మాస కవితా సంఖ్య:-30 *ఆ.వె* ఇంకనిద్ర యేల జంకు లేకుండాను లేచిరావె చిలుక లేచిరావ నీగడుసు దనమ్ము నేర్పరి తనమంచు గోదదేవి పిలిచె గోపికలను... *ఆ.వె* వచ్చుచుంటి నిపుడె పరుగెత్త మనుటేల బెదిరిపోదునమ్మ యదిరిపోదు నీలవేణి యనగ నీవురమ్మనుచును గోదదేవి పిలిచె గోపికలను... ఈపద్యాలు నాస్వంత రచనయని తెలుపుకొనుచున్నాను. [31/12/2024, 10:45 AM] +91 96665 17365: మహతీ సాహితీ కవిసంగమం ధనుర్మాస కవితోత్సవం-2024 తేదీ: 31/12/2024 శీర్షిక: గోదాదేవి పిలుస్తుంది! గోపికలు రారండి! కవిపేరు: కుంతీపురం మాధవీ లత ప్రక్రియ: వచన కవిత కవిత సంఖ్య: 16 క్రమ సంఖ్య : 5 ******************************* పదహారవ రోజు గోద, గోప బాలికలు నంద నందనుని ఇంటికి వచ్చి ఆ గృహ కాపలాధారుని తలుపు తీయమని వేడుకుంటున్నారు. రేపల్లె గొల్లలము వేణుగాన ప్రియుని దర్శింప వచ్చాము గొల్ల పిల్లలము గోపాలుని కడకు పరిశుద్ధ మనసుతో పాడుతూ వచ్చాము అజ్ఞానులమైన నందనందనుని పైన అత్యంత ప్రేమానురాగాలు కలవు మాకు ఇంద్రనీలమణి వర్ణము కలవాడు ఇందీవరాక్షుడు 'పరై' అనువాద్యమును ప్రసాదిస్తానన్నాడు పరిశుద్ధులమై మేము 'పరై' అనువాద్యమును పొందుటకు వచ్చాము స్వామి మేల్కొనుటకు సుప్రభాతము పాడగా వచ్చాము మణులతో కూడిన దృఢముగా ఉన్నట్టి తలుపు గడియ తెరిచి స్వామిని దర్శింపచేయుము అడ్డుకొనక మమ్ము ఆదరించి లోనికి పోనిమ్ము అని గోపికలు వేడుకొనిరి. హామీ పత్రం: ఇది నా స్వీయ రచన [31/12/2024, 11:01 AM] Addanki Lakshmi: మహతి సాహితీ కవి సంగమం ధనుర్మాస కవితోత్సవం 2024 తేదీ 31_12_24 శీర్షిక రామప్ప గుడి కవితా సంఖ్య 14 పేరు అద్దంకి లక్ష్మి ముంబై కవి సంఖ్య 50 కవిత రమ్యమైనది రామప్ప గుడి అధిష్టించె యునెస్కో పీఠము వడి వారసత్వపు కట్టడాలకు ప్రపంచ దేశాలలో గుర్తింపు తెలుగు రాష్ట్రాలకు మన్నింపు ఇసుక పునాది టెక్నాలజీ నీటిలో ఊగేటి ఇటుకల మర్మాలు,, జీ,, శతాధిక సాంకేత నైపుణ్యాలు సూదిమెన పెట్టే నగిషీలు నల్లశానపు శివ లింగాలు చూపుతాయి చారిత్రక విశేషాలు, కొత్త దంపతుల హనీమూన్లు పిల్లాపాపలతో కేరింతలు నూతన ప్రదేశ సందర్శకులు జోరుగా విదేశీ పర్యాటకులు మెచ్చేరు రామప్ప శిల్పాల అద్భుతాలు, వింత వింత ప్రకృతి శోభలు టికెట్లకు చాంతాడు లైనులు కాకతీయ కళా నైపుణ్యాలు అణువణువు పులకింతలు తెలంగాణ రాష్ట్ర వైభవాలు రంగ మండపం రమణీయ దృశ్యం నాట్య శృంగారాల భంగిమలకు దాస్యం అద్దంలా మెరిసే ప్రతిబింబాలు స్తంభాల చెక్కిన నగిషీల అద్భుతాలు రండీ,,, రారండని... పర్యాటకులను రామప్ప పిలిచేను,, విహారయాత్రకు పోదాం అంటూ ఆనందంగా కదిలేను,, హామీ ఈ కవిత నా స్వీయ రచన [31/12/2024, 11:06 AM] Dr M Ahalya Devi: మహతీ సాహితీ కవి సంగమం ధనుర్మాస కవితోత్సవం-2024 31/12/2024 శీర్షిక:జ్ఞాన సుధ డా.మరుదాడు అహల్యా దేవి బెంగుళూరు జాబితా సంఖ్య:7 కవితా సంఖ్య:16 నీకు సంతానమన్న మహా ప్రీతి ఉండొచ్చు కానీ వారిపట్ల నీ ప్రవర్తన చాలా విడ్డూరం.. వారినుంచి ఎక్కువ ఆశిస్తున్నావు నేస్తం భరించలేవు ఒకవేళ అనుకున్నది జరక్కపోతే. కుమారులపై కన్నా కుమార్తెలను ఎక్కువ ప్రేమిస్తావు మంచిదే వాళ్ళకన్నా వీళ్ళే నయం కదూ.. పైకి కనిపించనీయవు నీ బాధను నీ హృదయం మరీ ఇంత కోమలమా.. తల్లిగా పిల్లలను స్వచ్ఛమైన వాతావరణంలో పెంచాలనుకోవడం మంచి నిర్ణయమే.. సంతానానికి ఉన్నతవిద్య అందించడం. కోసం మాతృమూర్తిగా సర్వం ధారపోయడం అభినందనీయం... అవసరమైతే భర్తతో తగవైనా పడటానికి సిద్ధపడటం నిజంగా అభిలషణీయం.. ప్రేమిస్తావు,గౌరవిస్తావు, ఇంతలో బాధపెడతావు భార్యని ఏమిటి నీ ఉద్దేశ్యం.. స్వతంత్రంగా మాట్లాడితే మండి పడ్డం ఎందుకు నువ్విచ్చిందే కదా ఆ అవకాశం.. ఒకచోట కూర్చోవు, అయినా బుద్దిగా ఉంటావు,ఖచ్చితంగా సఫలమౌతాయి నీ నిర్ణయాలన్నీ ఏమిటో రహస్యం.. సమాజంలో నీకు విశిష్టస్థానం ఉండటానికి కారణం బృహస్పతి రాశ్యాధిపతి కావడమే.. పరిచయస్తుల మనస్సుల్లో చెరగని ముద్ర వేశావు నాకు తెలుసు అదంతా నీమాటకారితనం ప్రభావమే.. క్షత్రియుడివైనా సత్వ గుణం,శాంత లక్షణం కన్పిస్తుంది నీలో విచిత్రం.. ఇతరులను ఆకర్షించి వారి స్మృతిపథంలో నిలిచిపోవడం నీకు వెన్నతో పెట్టిన విద్య. నీవశంలో ఉండే మూలా నక్షత్రంలో జన్మిస్తే శాంతి చేయించాలి తెలుసునా.. చేయిస్తేనే మంచిది అసలే ఆ నక్షత్ర జాతకులు బ్రతకడం కష్టమని చెబుతోంది శాస్త్రం. బ్రతికితే మాత్రం భాగ్యశాలురుగా, విశిష్ట వ్యక్తులుగా వెలుగొందడం ఖాయమట. గర్వం,తొందరబాటు, అసభ్యత వంటివి నీలో ఉండే అవగుణాలైతే.. ఔదార్యం,బుద్ధికుశలత,తర్కశాస్త్ర ప్రావీణ్యం వంటివి శ్రేష్ఠగుణాలు.. అందుకే కాబోలు అదృష్టం, పుణ్యస్థానమైన నవమం ధనూరాశిగా స్థిరమైంది నీకు రాశిచక్రంలో..!! స్వీయ రచన మిత్రవింద [31/12/2024, 12:05 PM] Balluri Uma Devi: మహతీ సాహితీ కవిసంగమం అంశము: ధనుర్మాస కవితోత్సవము/2024 తేదీ: 31/12/24 శీర్షిక: కనక దుర్గ శతకము కవితా సంఖ్య:16 కవిపేరు: డాక్టర్ బల్లూరి ఉమాదేవి కవి సంఖ్య:34 ప్రక్రియ: ఆటవెలది పద్యములు దక్షిణ కరమందు దాల్చి త్రిశూలమున్ వామ హస్తమందు వాసిగాను కమల మొకటి దాల్చి కాపాడు తల్లివే కరుణ చూపు మమ్మ కనక దుర్గ. //61// చంద్రవంక దాల్చి జనులమనములందు యజ్ఞతలను బాపి యనవరతము జ్ఞానమొసగునట్టి శంకరు సతివీవె కరుణ చూపు మమ్మ కనక దుర్గ. //62// ఆకులలుములు విడి యాచరించ తపము మెచ్చు చెల్ల సురలు మేటిగాను భవుడె పతియగునను వరములందినమాత కరుణ చూపు మమ్మ కనకదుర్గ. //63// కడలి యందు పుట్ట కాలకూట విషము నమరులసురు లెల్ల హడలుచుండ గ్రోలు మనుచు హరుని కోరిన మాతవు! కరుణ చూపు మమ్మ కనకదుర్గ. //64// హామీపత్రము: స్వీయ రచన డా బల్లూరి ఉమాదేవి [31/12/2024, 12:15 PM] +91 90104 92494: మహతీ సాహితీ కవిసంగమం ధనుర్మాస కవితోత్సవం-2024 తేదీ: 31/12/2024 శీర్షిక: కృష్ణ శతకం కవిత సంఖ్య:16 కవిపేరు: పి.వి.వి.యన్.రాజ కుమారి.(23) కందపద్యాలు నందుని యింటను పెరిగెను సందడి జేయుచు ప్రియముగ సౌఖ్యము పంచెన్ నందము తోడ భువిన కను విందును జేయుము సతతము విడువక కృష్ణా!57 నల్లని కన్నయ్యను గని తల్లియె ప్రేమగ మురిసెను ధన్యత పొందెన్ వెల్లువ తోడను పేర్మిగ కల్లల నాడుచు పడుచుల కాచుము కృష్ణా!58 అష్టమి రోజున పుట్టిన నిష్టగ గోపాలకులిల నిరతము కొలిచెన్ కష్టము లన్నియు బాపుచు నష్టము కలుగక జనులకు నడుపుము కృష్ణా!59 కృష్ణుని నామము దలచుము కృష్ణుని కొలువుము పదముల కీర్తింపు మదిన కృష్ణుడె జగతికి గురువిల కృష్ణుడె జీవుల హృదయపు ఖేలుడు కృష్ణా!60 [31/12/2024, 12:48 PM] vtr Mohanrao: మహతీ సాహితీ కవిసంగమం ధనుర్మాస కవితోత్సవం-2024 తేదీ: 31-12-2024 శీర్షిక: తిరుప్పావై పాశురము-16 ప్రక్రియ: వచన కవిత కవిత సంఖ్య: 16 కవిపేరు: వి.టి.ఆర్.మోహనరావు కవి సంఖ్య: 26. ---------------------------- నందగోపబాలుని ద్వారములను రక్షించేస్వామీ! ఓ ద్వారపాలకుడా రేపల్లె గొల్లపిల్లలమైన మేమందరమూ వేణుగానలోలుని దర్శనార్థం వచ్చాము మణిమయమైన చిరుగజ్జెలతో కూడిన చక్కని ద్వారములను వెంటనే తెరువండి యశోదమ్మ బిడ్డడు మమ్ము రమ్మన్నాడు మా మేలుకొలుపులతో తనని లేపమన్నాడు ఈరోజు మాకు దర్శనమిస్తానన్నాడు ఆయనకు సుప్రభాతం పాడుటకై అందరం శుచిగా స్నానమాచరించి వచ్చాము అదీ ఇదీ అనీ నువ్వు అడ్డుచెప్పకము లేదని కాదని సాకులు మాకు చెప్పకము మేళతాళములన్నీ దయతో మాకు ఇవ్వుము అందమైన ఈ తలుపులు తెరవుము మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాము స్వామి దర్శనం వెంటనే మాకు కల్గించుము శుభాలను కల్గించెడి స్వామిని కీర్తించుచూ అందరం కల్సి ఈవ్రతమాచరించుదాం రండి అపరిమిత ఆనందం పొందుదాం రారండి ---------------------------- హామీపత్రము: పై వచన కవిత నా స్వీయ రచనని హామీ ఇస్తున్నాను. [31/12/2024, 1:08 PM] Jakkani Gangadhar: మహతీ సాహితీ కవిసంగమం ప్రతిరోజూ కవితా పండుగే అంశము: ఇచ్చికం - నువ్వుల నూనె తేది: 31.12.24 శీర్షిక: గానుగు ధనుర్మాస కవితా సంఖ్య: 39 కవి పేరు: జక్కని గంగాధర్ మహతీ సాహితీ కవిసంఖ్య: 73 ప్రక్రియ: పద్యం ఈవారం కవితా సంఖ్య: 16 ఆ.వె గానుగనిన చాల గమ్మత్తుగా నుండు నూనె తీయుచుంద్రు నువ్వులందు గుండ్రముగను దిరుగు గూడి జోడెద్దులు జక్కనార్యు మాట జయము నిడును! ---------------8--------------- ఫై పద్యం నా స్వంత రచన. అని హామీ ఇస్తున్నాను. [31/12/2024, 1:46 PM] +91 84838 78838: మహతీ సాహితీ కవి సంగమం ధనుర్మాస కవితోత్సవం 2024 అంశం :ఐఛ్ఛికము శీర్షిక: శుభములు తెచ్చు ఉగాది పండుగ. తేది:31-12-24 వారం: మంగళ వారం. పేరు: రాధా సురేష్ యర్జల్. ఊరు: పూణె (మహారాష్ట్ర) ప్రక్రియ: వచన కవిత. ఈ వారం కవితాసంఖ్య 1️⃣4️⃣ మహతీ సాహితీ కవి సంఖ్య 4️⃣ ఏదేశ మేగినా ఎందుకాలిడినా ఏపీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీజాతి నిండు గౌరవము తెలుగు ఖ్యాతిని అమ్మ లాంటి మధుర భాషనూ మరువద్దు. మహాభారత రచన ఆదికవి నన్నయ తిక్కన్న ఎర్రన్న తెలుగు శైలి లో మెరిసిన మెరుపు భాషను... త్యాగయ్య గొంతులో మెదిలిన మధురం తెలుగు... అపురూప నెమలి అందమైన తెలుగు పాఠ్యగ్రంధమున గ్రాంథిక మై.. మెరుపు తీగవలె... పద కేళిలా మెరుయుచున్నది మన తెలుగు శ్రీ కృష్ణ దేవరాయలుచే పలికిన మధురభాష. ముత్యాల వలె మెరయును తెలుగు శైలి. చెంగు చెంగున గోదారమ్మ లా పరవళ్ళు తొక్కుతూ.. నిండు కుండ తో పాయస రూపంలో సింగారించుకున్న ఆరు రుచుల మేళవింపై శుభాలను తెచ్చే ఉగాది పండుగ. రంగరించి ముస్తాబై వస్తోంది ఆకుపచ్చని నేలనే చీరై ధరించి కోయిల గీతా లాపనలో..పల్లె పట్నం తేడా ల్లేకుండా జీవన సత్యాలన్నీ పల్లకి లో మోస్తూ నవవసంతపు ఉగాది ఉత్సాహాలతో ఉరుకులు వేస్తూ ఆరు రుచులు మేళవించి వేప పువ్వు పచ్చడి తో ఉగాది పచ్చడి సేవిస్తూ నవ్య సంప్రదాయ ఉగాది కి ఆనందోత్సాహాలతో స్వాగతం పలుకుదాము. అందరికీ శుభాలు కలగాలని కోరుకుందాము. తెలుసుకో రాధమ్మ. హామీ పత్రం: ఈరోజు నేను రాసిన కవిత.నా స్వీయ రచన కేవలం ధనుర్మాస కవితోత్సవం కోసమే రాసానని ప్రమాణ పూర్వకముగా హామీ ఇస్తున్నాను. [31/12/2024, 2:08 PM] Vijaya Lakshmi: మహతీ సాహితీ కవిసంగమం ధనుర్మాస కవితోత్సవం-2024 తేదీ: 31-12-2024 శీర్షిక: వాల్మీకి రామాయణం. (విజయ రాఘవీయము) ప్రక్రియ: వచన కవిత కవిత సంఖ్య: 1 కవిపేరు: దొంత రాజు విజయలక్ష్మి కవి సంఖ్య: 5 ---------------------------- గణనాధునికి విన్నవించి మనసారా మదిని పూజించి వాయుపుత్ర హనుమాన్ కోరి ఆశీస్సులు పొంది రాయుచుంటి నిర్విఘ్నముగా రచన సాగించమని సద్గురు రాఘవేంద్రుని వేడితిని త్రిచేతుని శాపవసాన భువియందు జన్మించే బుక్కడు నామధేయముతో జంటలో ప్రాణం విడిచిన పక్షిని చూసి సోక పూరితుడై బాధ లో స్లోకం పలుకగా మనీషా ప్రతిష్టాంత,...32 అక్షరాలతో రామాయణ కావ్యం తొలి శ్లోకంగా 24000 శ్లోకాలతో, శ్లోకానికి 32 అక్షరాలతో రామ చరిత శుభారంభం! వాల్మీకి మహర్షి కృపాకటాక్షాలతో రాయ సంకల్పించితి నేను మహతి యందు ధైర్యంచేయుచున్న నన్ను ఆశీర్వదించి నడిపించండి గురువులారా!! ************************** హామీపత్రము: పై వచన కవిత నా స్వీయ రచనని హామీ ఇస్తున్నాను. [31/12/2024, 2:16 PM] Iluri Vedha Kumari: మహతీ సాహితీ కవిసంగమం ధనుర్మాస కవితోత్సవం -24 తేదీ :31/12/2024 శీర్షిక :హర స్తుతి (ఇష్టపది -16) పోగుల భాగ్యలక్ష్మి ధనుర్మాస కవి సంఖ్య :38 కంఠమున గరళంబు కాటిలో వసనంబు కాలనాగులు మెడన గంగమ్మ శిరముపై అర్ధభాగము నగజ యగ్ని మూడవ కన్ను చేతిలో ఢమరుకము చితిమంట దీపంబు జడలు గట్టిన నెత్తి జంగాల దేవుడవు త్రిలోకములే యిల్లు తిరిప మెత్తెడి వృత్తి యేమి రూపము శివా యేడ నుంటివి హరా కరుణించి గావరా కనకలింగేశ్వరా (ఇది నా స్వీయ రచన ) [31/12/2024, 3:03 PM] Bhavani Krishna Murthy: మహతి సాహితి కవి సంగమం ధనుర్మాస కవితోత్సవం.. 2024 తేదీ....31..12.2024 శీర్షిక.... భాగవతకథా సుధ (కుచేలోపాఖ్యానం ) కవి పేరు: డా. జి. భవానీ కృష్ణమూర్తి జాబితా సంఖ్య.... 49 కవిత సంఖ్య.........16 ప్రక్రియ....వచన కవిత "నాయనలారా!ఈ అడవిలో చలి, వానలో బాధ పడ్డారు. శిష్యులుగా గురు ఋణమును మీరు తీర్చుకున్నారు. "మీకు ధన దార బహుపుత్ర సంపదలు చేకూరును "అని దీవించి, పుత్ర వాత్సల్యముతో ఇంటికి తీసుకెళ్లారు. గురుకులంలోని విషయములన్నీ నీకు గుర్తున్నవి కదా." అని పలికిన కృష్ణుని చూసి పరమానంద భరితుడయ్యే. "దామోదరా!గురుకులంలోని విషయాలు గుర్తున్నావా? ముల్లోకాలకు గురువైన నీకు మరొక గురువు కావలేనా? లోక మర్యాద పాటించుటకై గురుకులంలో చేరితివి"అనె. చిరునవ్వుతో మాట మరల్చి "మిత్రమా!ఏమి తెచ్చితివి కానుక చిన్నదైనా నేను ప్రేమతో ఇష్టంగా స్వీకరించెదను. ద్యూత వేశ్య సురాపానము వంటి పనులు చేయుచూ మేరుపర్వతమంత ఘనమైనవి తెచ్చినా స్వీకరింపను నాకు భక్తులైనవారు ప్రేమలో ఆకుగాని, పువ్వుగాని పండుగాని, నీరుగాని ఇచ్చిన లేశమైనా స్వీకరించెద దానిని మథురాన్నముగా భావించెద"యని పలికె. ఆ పేద విప్రుడు వచ్చిన కారణము గ్రహించె కృష్ణుడు పూర్వ జన్మలో ఐశ్వర్యముకోరి నను సేవించలేదు ఇప్పుడైనా భార్యను సంతోషపరుచుటకై వచ్చెనితడు ఇతనికి బహువిధములైన సంపదలీయదలచెనా హరి. ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను. [31/12/2024, 3:03 PM] +91 80085 72446: మహతీ సాహితీ కవిసంగమం ధనుర్మాస కవితోత్సవం-2024 తేదీ: 31-12-2024 శీర్షిక: సుభాషితాలు కవిత సంఖ్య:16 కవిపేరు: కందూర్ చంద్ర ప్రకాశ్ గుప్తా కవి సంఖ్య:11 విశ్వము కాలము పరమాత్మ స్వరూపము చైతన్యమయ ప్రకృతికి మారుటయే ధర్మము సతతం కదులుతున్న కాలంలో మారే క్షణము గడిచినదంతా గతమొక అపురూప ఙాపకము ప్రతి పన్నెండు నెలలకు ఒక సంవత్సరము కందూర్ హేమంతుని చలి దుప్పటి ఆవరణము డిసెంబర్ మాసం చివరాఖరి దినము నడిరేయి పన్నెండుకు పలుకుదాము వీడ్కోలు స్వాగత సమ్మేళన సందోహము సంబురాల సమయాన నూతన సంవత్సరము కందూర్ ఆవిర్భావం అందరి మనసుల్లో ఆనందము అందరినోటా హ్యాపీ న్యూ ఇయర్ గానము గత ఏడాది ఙాపకాల వైభావాల సమీరము రాబోయే రోజుల్లో మంచికి పలుకు శుభము మధుర పదార్థాలు ఇచ్చి పుచ్చుకోవడము కందూర్ పుష్ప గుచ్ఛాలు పలుకే ఆహ్లాదాల ఆహ్వానము గాత్రవైభవము నాట్యప్రదర్శనల పర్వము రాబోయేది సుందరమనే తత్వానికి రూపము నూతన సంవత్సరం అందించు ఆనందము ముందస్తు నూతన సంవత్సరం శుభాకాంక్షలు కందూర్ హామీ పత్రం: పై పంచపదులు నా స్వంత రచన అని హామీ ఇస్తున్నాను [31/12/2024, 3:23 PM] +91 94405 30763: మహతీ సాహితీ కవిసంగమం ధనుర్మాస కవితోత్సవం-2024 తేదీ:31.12.2024(మంగళ వారం) శీర్షిక:సుందరకాండ కవిపేరు:కాటేగారు పాండురంగ విఠల్ ధనుర్మాస కవి సంఖ్య:01(కవితా సంఖ్య:16) ప్రక్రియ:(పంచపది)వచనం 61 రావణుడు ప్రహస్తుని పుత్రుడు జంబుమాలిని పంపె హనుమంతుడు పరిఘతో అతన్ని చంపి సాగనంపె రావణుడేడుగురు మంత్రి సుతులను సేనతో పంపె భీకరంగా గర్జించి వారిని యమలోకానికి పంపె సుందరం శ్రీరామ,సీత,వనం,కావ్యం,కపి విఠల! 62 హనుమ కొందరిని అరచేతితో హతమార్చసాగె ఇంకొందరిని ముష్టిఘాతాలతో సంహరించసాగె మరి కొందరినేమో వాడియైన గోళ్ళతో చంపసాగె యుద్ధభూమి శత్రువుల శవాలతో నిండిపోసాగె సుందరం శ్రీరామ,సీత,వనం,కావ్యం,కపి విఠల! 63 పిమ్మట విరూపాక్షుడు తన మహా సైనతో వచ్చె యూపాక్షుడు సైనికులను వెంటబెట్టుకొని వచ్చె దుర్దనునితో పాటు ప్రఘసుడూ సైన్యంతో వచ్చె భాసకర్ణుడనే సేనా నాయకుడు సేనలతో వచ్చె సుందరం శ్రీరామ,సీత,వనం,కావ్యం,కపి విఠల! 64 మూకుమ్మడిగా మారుతిపై సేనలు దాడిచేయగా వారంతా అతని చేతిలోనే నిహతులై పోయిరిగా రణభూమి రక్త మాంస,కళేబరాలతో నిండెనుగా అది రాక్షస,ఆయుధ,రథ శకలాలతో వుందిగా సుందరం శ్రీరామ,సీత,వనం,కావ్యం,కపి విఠల! ఈ పంచపదులు నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను. [31/12/2024, 3:47 PM] +91 96401 15956: మహతి సాహితీ కవి సంగమం ధనుర్మాస కవితల పోటీ 31/12/2024 అంశం ; దశావతారములు (16) శీర్షిక : శ్రీ రామ చంద్రుడు బిరుదు రాజు ప్రమీల రాణి (17) ***************** నీల మేఘ శ్యామ సుందరుడు శ్రీ రామ చంద్రుడు.. అరవింద దళాయ తాక్షుడు విశాల వక్షస్థలం అజాను బాహుడు నీలవర్ణపు దేహఛా య.. బిడ్డలను వారి ఎదుగు దలను చూసి ప్రతి క్షణం పొగిపోతున్నారు తల్లి దండ్రులు.. బాల్య దశ దాటి యుక్త వయసు లో అడుగుతున్న సమయం లో విశ్వా మిత్ర మహర్షి వచ్చారు.. విశ్వామిత్ర మహర్షి ని సాదరంగా ఆహ్వానించి ఉచిత ఆసనం పై కూర్చుండ బెట్టి అతిథి మర్యాదలను చేశారు.. నేను అడిగింది చెయ్యగలవా దశరథ మహారాజు అని మహర్షి అడిగారు.. స్వామీ...మీరు ఏం కోరితే అది తప్పక నెరవేరుస్తానని మత్సిచ్చాడు దశరథుడు... నేను యాగము తలపెట్టాను కానీ రాక్షసుల బెడద ఎక్కువగా వుంది.. నిరాటంకంగా సాగాలంటే యాగ రక్షణ కోసం నీ పుత్రుడు రాముడ్ని నాతో పంపమన్నాడు.. అయ్యో..ముక్కుపచ్చలారని వాడు నా రాముడు.. స్వయంగా నేను వస్తాను మీ యాగ రక్షకుడిగా వుంటాను అన్నాడు దశరథుడు.. వలదు నాతో నీ కుమారుడి నే పంపు రఘువంశ జుడవు,హరిశ్చంద్రుని వారసుడవు.. ఆడిన మాట తప్పుతావా.. సరే అయితే నేను వెళ్ళి వస్తాను అని మహర్షి వెళ్ళ బోయాడు.. ఆగండి మహర్షి నేను మాట తప్పను మీ ఇష్టప్రకారం చేస్తాను అన్నాడు దశరథుడు.. శాంత చిత్తు డై మరల ఆశీనడయ్యే విశ్వామిత్ర మహర్షి.. [31/12/2024, 3:59 PM] M Satya Veena: మహతీ సాహితీ కవి సంగమం ధనుర్మాస కవిత్వం: 2024 31/12/2024 మంగళవారం ధనుర్మాస కవిత సంఖ్య: 15 ధనుర్మాస కవి సంఖ్య: 2 అంశం: ఐచ్చికం శీర్షిక: గోకులంలో రాధ శ్రీమతి సత్యవీణమొండ్రేటి హైదరాబాద్. ప్రేమకే ప్రతిరూపం రాధ మధురమైన మమతాగాధ కామ క్రోధ మద మాత్సర్యాలు ఎరుగని ప్రేమ రాధాకృష్ణుల పవిత్ర ప్రేమ నాటికినేటికిజనహృదయాల ను రంజింప చేసిన అమర గోకులంలోయాదవపాలకుడైన వృషభానుడు కీర్తిదా రాధ తల్లిదండ్రులు... యమునా నదిలో తేలుతున్న ప్రకాశించే కమలంపై రాధ లభించింది అని కూడా చెపుతారు.. సాక్షాత్తు లక్ష్మీ అవతారం.... కృష్ణుని మేనత్త రాధ కృష్ణుని కన్నా 9 నెలలు పెద్దది...... బాల్యం నుండి కలిసి పెరిగిన ఆత్మీయత అనురాగ మిళితమైన వారి ప్రేమ అజరామరం.... యుగాలు తరాలు మారినా ప్రజలలో ప్రేమ దేవతలు రాధాకృష్ణులు ధనుర్మాస దైవాలుగా గోదా శ్రీరంగానాధుల రూపాన జగతికిజేజేలుపలుకుతున్నారు... కృష్ణం వందే జగద్గురుం నా స్వీయ రచన [31/12/2024, 5:13 PM] Gangadhar Kollepara: మహతీ సాహితీ కవిసంగమం ధనుర్మాస కవితోత్సవం 2024 తేదీ : 31/12/2024 శీర్షిక : కైలాసం - వర్ణనం కవిపేరు : గంగాధర్ కొల్లేపర క్రమ సంఖ్య : 12 ప్రక్రియ : వచన కవిత (16) ************************** ఆదిదంపతుల ఆవాసం - అతి పవిత్ర ప్రదేశం పవిత్ర సాధకులకు శాశ్వత నివాసం.. ముల్లోకాలలో విలక్షణం, ఉత్కృష్టం, శ్రేష్టం... లక్ష యోజనాల వైశాల్యం, మహారత్న, వైడూర్య సమూహాలతో గృహాల నిర్మాణం... శంభుని యోగ శక్తితో నిరాధారమై ప్రజ్వరిల్లుతోంది కైలాసం... సూర్యచంద్ర కిరణాలు సోకనిది అగ్నిజ్వాలలే ప్రాకారాలుగా శోభిల్లుతోన్నది.. మందార, దేవా వృక్షాలు, గగనంలో విహరించె కొంగల గుంపులు... కామదేనువు, సాధు జంతువులతో మదిని దోచే ప్రకృతి రమణీయతలు... కిన్నెర యువతుల గానములు, త్రిపుర జయగాధల పాటలు.. నెమళ్ళ క్రేంకారాలు, తుమ్మెదల ఝాంకారాలుతో సందడులు... శివమంత్రాలను వల్లించే చిలుకలు, పాఠములు చదివే పక్షి జాలాలు... "విశ్వాధికో రుద్ర మహర్షి" అంటూ మధురంగా పాడే కలహంసల సమూహలు... "ఈసావాస్యమిదం సర్వం" అంటూ ప్రేమతాత్వాన్ని బోధించే రాజహంస సమూహలు... "శివ ఏవ కేవలః" అని జపించె మల్లికా పుష్పాలు... పరమ శివార్చనతో పూణీతమయ్యే చక్రాంగ సంఘాల సమ్మేళనం కైలాసం... అహరహం శివలింగనికి తమ పాలతో అభిషేకించే ఆవులు... నిత్యం సుమములు రాలుస్తూ పూజించే పుష్పలతలు... క్షణక్షణం తమ దళాలను అర్పించే మారేడుచెట్లు ఆదిదేవునికి నైవేద్యమయ్యే ఫలవృక్షాలు... అధ్వరతికై నిష్ఠతో ధ్యాన యజ్ఞాలు... ఓం నమఃశివాయ జపంతో పులకించే జీవజాతుల సమ్మిళితం కైలాసం... హామీ : ధనుర్మాస కవితోత్సవం కోసం రాసిన ఈ కవిత నా స్వీయ రచన. [31/12/2024, 5:28 PM] Limbadri Alagandula: మహతీసాహితీ కవిసంగమం ధనుర్మాస కవితోత్సవం. 2024 తేది.31.12.2024 కవిత సంఖ్య.16 శీర్షిక.శ్రీహరికి వినతి ఎలగందుల లింబాద్రి నిజామాబాద్ 22 ప్రక్రియ.పద్యం తే.గీ. తెలుగు వత్సర విలువను తెలియకుండ నాంగ్ల వత్సర వైభోగ మవసరంబ? తెలియదాయె యుగాదియే దివ్య మనుచు. దీన రక్షక లక్ష్మీశ దేవదేవ!. ఈ పద్యము నేను స్వయంగా వ్రాసినానని హామీ ఇస్తున్నాను. [31/12/2024, 5:37 PM] Ratna Lakshmi: మహతీ సాహితీ కవిసంగమం ధనుర్మాస కవితోత్సవం-2024 తేదీ: 31-12-2024 శీర్షిక: *మలగని వెలుగు నా తెలుగు* కవిత సంఖ్య: 7 కవి పేరు: ఎస్. రత్నలక్ష్మి ప్రక్రియ: వచన కవిత కవి సంఖ్య: 62 ~~~~~~~~~~~~~~~ నానాటికీ అందరిలో పెరిగిపోతోంది ఆంగ్లభాషపై తగని మోజు మీదుమిక్కిలి అన్యభాషల పట్ల విపరీతమైన తరగని క్రేజు చిట్టచివరికి తేట తెలుగుభాషకు పట్టిస్తున్నారు బూజు ఇదీ... నేటిసమాజంలో ఎక్కడ చూసినా కనిపిస్తున్న మనుషుల రివాజు 26 అక్షరాల ఇంగ్లీషుభాష, 56 అక్షరాల తెలుగును తొక్కేసింది నేడు తేనెలొలుకు తెలుగు భాషకు శాశ్వతంగా సమాధి కట్టేసింది బడిలో తెలుగు మాట్లాడితే దండనతో బాటుగా జరిమానా విధిస్తుంది తెలుగుమాట పలికితే సంతలోని వింతపశువుగా జమ కట్టేస్తుంది నాడు గిడుగువేసిన ముందడుగుతో పరిఢవిల్లి ప్రకాశించిన భాష నేడు మసకబారి రెపరెపలాడుతోంది అమరజ్యోతి తెలుగు భాష వీనులవిందుగా వినసొంపుగా వినిపించేది నాడు తెలుగు హమేషా నేడు తెగులుసోకిన తెలుగువారి రీతితో మలుగుతోంది తెలుగు భాష ఇకముందైనా అందరం అచ్చులతో అలరారే అజంతా భాషను ఆదరిద్దాం ఇకనైనా మనమంతా తప్పక తెలుగులోనే మాట్లాడాలంటూ బాసచేద్దాం తెలుగుభాషకు మళ్ళీ పూర్వవైభవం వచ్చేలా కడు తీవ్రమైన కృషిచేద్దాం నేటినుండీ లుప్తమయ్యే మధురభాషకు ఊపిరిలూది ప్రాణంపోద్దాం ... పట్టాభిషేకం చేద్దాం ఎస్. రత్నలక్ష్మి అసిస్టెంట్ ఇంజనీర్ నంద్యాల ఈ కవిత నా స్వీయ రచన. ఇది దేనికి అనువాదం అనుకరణ కాదని హామీ ఇస్తున్నాను. [31/12/2024, 5:37 PM] KrishnaReddy.Gaddam: మహతీ సాహితీ కవిసంగమం ధనుర్మాస కవితోత్సవం-2024 తేదీ: 31/12/2024 శీర్షిక: పెద్దల మాట కవిపేరు: గడ్డం కృష్ణారెడ్డి.సూర్యాపేట జాబితా సంఖ్య:10 కవితా సంఖ్య: 16 ప్రక్రియ: పద్యము ఆటవెలది! భాషనెరిగి గురులు భాషించు చుండగ శిష్య గణము నేర్చు శీఘ్రముగను! గురుతు దెలిసి నిలుపు గురుశిష్య బంధమ్ము తెలుసుకోర కృష్ణ తెలివితోడ!! స్వీయరచన............ [31/12/2024, 5:42 PM] J Madhusudhan Sharma: *మహతీ సాహితీ కవిసంగమం* *ధనుర్మాస కవితోత్సవం-2024* *తేదీ: 31-12-2024* *శీర్షిక: విజ్ఞేశ్వరు ప్రార్థన *కవితా సంఖ్య:*16 *కవిపేరు:* జోషి మధుసూదన శర్మ *కవి సంఖ్య:* 27 *ప్రక్రియ* పద్యములు ( ఆటవెలదులు ) చిన్ని శతకమొకటి చిట్టివౌ పొట్టివౌ మాటలల్లి వ్రాయ మధుర భాష నాదు తెలుగునందు నమృతంబొల్కగా! మాధవుని పలుకిది మాన్యులార! విఘ్నములును దొలగ విఘ్నేశ్వరుదలచి మొదలు బెట్టితినిట ముదమొ తోడ మంచి పద్యములవి మహిలోన నిలువ! మాధవుని పలుకిది మాన్యులార! *హామీపత్రము:*స్వీయరచన అని తెలియజేస్తున్నాను. [31/12/2024, 5:42 PM] +91 98401 89105: మహతీ సాహితీ కవిసంగమం ధనుర్మాస కవితోత్సవం-2024 తేదీ: 31-12-2024 శీర్షిక: విష్ణుమూర్తి అభినుతి కవితాసంఖ్య: 16 కవిపేరు: డాక్టర్ కురవి వేంకట కృష్ణశాస్త్రి కవిసంఖ్య : 3 ఇష్టపది: వినువీది మధ్యమున విష్ణుమూర్తిని గాంచి, పులకరించి పోయిరి పుర జను లచ్చెరువున, అతిలోక సుందరుడు అంబుజనాభుని గని పరవశించి పోయెను పాండ్య పరిపాలకుడు, హరికి దృష్టిదోషము అసాదించునేమో యనుచు విష్ణుచిత్తుడు అటమటించె గాదే, దిష్టి దోషము తగ్గ, 'తిరుపల్లాండు' చెప్పె పెరియాళ్వారు మిగుల ప్రేమ తోడ "కృష్ణా"!! హామీపత్రము: ఇది నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను. [31/12/2024, 5:48 PM] +91 98485 93401: మహతీ సాహితీ కవిసంగమం ధనుర్మాస కవితోత్సవం-2024 తేదీ: 31.12.2024 మంగళవారం శీర్షిక:ధనుర్మాసం కవిపేరు:తిరుమల మనోహరా చార్యులు కవి సంఖ్య 46 కవిత :వచనం 16 ********************* ఈ పాశురంలో బయటనున్న గోపికలకు లోపలనున్న గోపికకు మధ్య సంభాషణ ఓ చిలుకవంటి స్వర మాధుర్యంకలదానవు అయ్యో ఏమి ఆశ్చర్యము ఇంకనూ నిద్రించుచున్నావు పూర్ణగోపికలరా వచ్చుచున్నానమ్మా గొల్లుమని ఉలిక్కి పడేలా గొంతెత్తి పిలవకండమ్మా నీవు చాలా నేర్పరివి చమత్కారంగా మాట్లాడుతావు కదా నీ మాటల కాఠిణ్యము మేము ముందే యెరుగుదుము కదా మీరే సమర్థులమ్మా! నేను కాదులే అయినను మీరన్నట్లు నేనేకావచ్చులే నీ ప్రత్యేకత ఎమీ? ఏకాంతంగా వుండెదవు? త్వరగా బయటకు రా రావలసిన గోపికలందరూ వచ్చినారా అందరువచ్చారు నీవు వచ్చి లెక్కించవమ్మా నేను వచ్చి యేమి చేయాలో చెప్పండమ్మా కువలయపీడనమగు ఏనుగును సంహరించినవాడు శత్రువును అణచినవాడు మాయావి అయిన శ్రీకృష్ణుడిని గుణగణాలను కీర్తించరావమ్మా! వ్రతం శుభప్రదమగుటకు గోష్టి లో వచ్చి చేరవమ్మా! గోదావ్రతములో పాల్గొనండి రంగనికృపకు పాత్రులుకండి. పారమార్థిక సాధనకై రాస్తున్నవి మనోహరుని మధురభక్తి భావనలివి. హామీపత్రము: ఇది నా స్వీయరచన [31/12/2024, 5:53 PM] P Padmavthi: మహతీ సాహితీ కవి సంగమం 31/12/24 మంగళవారం కవన సంఖ్య..12 క్రమ సంఖ్య 13 డా.పద్మావతి పి హైదరాబాద్ ప్రక్రియ..వచన కవి శీర్షిక.. నవ నవోన్మేషం! ఉషోదయ అరుణ కిరణాలతో ఆశల భవితకు చిగురులు తొడుగుతూ ఉల్లాసోత్సాహాలతో స్ఫూర్తిని నింపింది తెలతెల వారింది తొలి ప్రొద్దు పొడిచింది ప్రాక్దిశలో విరిసాయి రంగుల హరివిల్లులు.. పరుగిడుతుంది కాలం కాలంతో పాటుగా మనిషిని మరబొమ్మలా చేసేస్తున్న మేథా విజ్ఞానం అడుగులు వేయిస్తుంది మున్ముందుకు ప్రగతి కి పాఠాలు నేర్పుతూ అలవాట్లను మార్చేస్తుంది యాంత్రిక జీవితానికి అనుగుణంగా నడవాలంటూ శాసిస్తుంది, మనసును మాయ చేస్తుంది భ్రమలో కొట్టుకుపోతూ, సుఖాల కోసం ముడుపులు కడుతూ.. అంతంలేని కోర్కెల వలయంలో కొట్టుకుపోతున్నా గత కాలపు జ్ఞాపకాలు గాయం చేస్తున్నా ఆశయాల సాధనలో లక్ష్యం దిశగా సాగుతున్న నీ జీవితం తడబడుతున్నాయి అడుగులు తప్పుల తడకగా స్నేహానుబంధాలకు దూరంగా స్వార్ధం రెక్కలు కట్టుకొని పై పైకి ఎగిరి పోతూ చెప్పిన మాట విననంటుంది మనసు ఇంద్రియ నిగ్రహం వశం తప్పి నిన్ను రాక్షసునిగా మలిచేస్తుంది గతమొక చేదుగా మిగిలిపోయింది కాలచక్రంలో, ఇకనైనా మేలుకో! ఓ మనిషీ! తర తమ బేధాలెంచక అందరమొకటేనని విలువలను కాపాడు కోవాలని మానవతా దృక్పథంతో మెలగాలని మంచిని ప్రేమించాలని.. సమ సమాజ నిర్మాణమె నీ ధ్యేయమని స్వాగతిద్దాం! నవవత్సరమరుదెంచు శుభవేళల ఘడియలను ఒకరికి ఒకరై కలిసీ మెలిసీ ఉందాం..మల్లెలా నిర్మల హృదయంతో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, ఆనందాలను పంచుతూ నూతన సంవత్సర శుభాకాంక్షల నందించుకుందాం జాగృత చైతన్యంతో;.... °°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°° ఇది నా స్వీయ కవిత [31/12/2024, 6:00 PM] Geeta Kumari: మహతీ సాహితీ కవిసంగమం ధనుర్మాస కవితోత్సవం-2024 తేదీ: 31-12-2024 అంశం:ఐచ్ఛికం శీర్షిక:భక్తిసుధ ప్రక్రియ:ఇష్టపది కవితాసంఖ్య:15 బత్తిన గీతాకుమారి కవిసంఖ్య:43 28. నిర్మల భక్తి తోడ నిద్దుర లేవమ్మా తిరుగుచుంటి చలిలో తెల్లవారునేమో! ప్రభువు కొలువుండెనా పడతి నీ యింటనే ముకుందు జాడదెలిపె ముదమె తులసి వాసన. బదులివ్వ రావోయి భాగ్యశాలి బయటకు నీ దరి స్వామి లేడ నీకు స్వాగతమ్మే. ఆలస్యము జేయక నైదవ సఖియా రా! కుంభకర్ణుని నిద్ర కూసింత వదలి రా! 29. పిలుపైన వినరాద తలుపైన తెరువవా ప్రత్యుత్తరమీవే ప్రతిభాశాలి నీవె విమల జ్ఞానివి నీవె విశిష్టాభరణమువె ప్రత్యేకత గల్గిన ప్రజ్ఞాశాలివీవె. నీవు తోడుండవలె నీలదేహి పూజకు నాయకత్వము జేయ నా యిష్టసఖి రావె! కదలక వదలక నిను గానగ నిలిచితినే నోముఫలము బొందగ నోరార భజింతుమె. హామీపత్రము: ఇది నా స్వీయరచన [31/12/2024, 6:12 PM] +91 94404 08080: మహతీ సాహితీ కవి సంగమం ధనుర్మాస కవితోత్సవం 2024 తేదీ 31/12/24 శీర్షిక. కొత్త ఏడాది కవితా సంఖ్య 16,కవి సంఖ్య 56 ప్రక్రియ. వచనం పేరు. ఉమాశేషారావు వైద్య ------------------- ---- - - వాదనలు వద్దు జనవరి 1 వద్దు ఉగాది ముద్దు నూతన సంత్సరం అంటే ఏంటి? తాగడం,ఊగడం తినడం, తినిపించడం కేక్ లు కట్టింగ్ లేనా గతం మన స్థితి ఏంటి మన గమ్యం లోని ఆటంకాలు అపజయనికి కారాణాలు విశ్లేచించుకో గతం లో జీవించకు వర్తమానం కాదనకు విశ్వమానవుడి గా ఆలోచించు విశ్వాన్ని ప్రేమించు జీవితం రాయని డైరీ కాదు వర్తమానం తో ముడి పడి ఉంది భవిష్యత్తు కాలమాగదు కాలంతో పోటీపడి విజయాలు అందుకుందాం రేపటి గురించి శోధిద్దాం నువ్వు నేను కలిపి జనం ఈ జనమే సమాజం సమాజ హితమే నూతన సంవత్సరం [31/12/2024, 6:19 PM] +91 99122 33739: మహతీ సాహితీ కవిసంగమం ధనుర్మాస కవితోత్సవం-2024 31-12-2024 కవితాసంఖ్య:12 బి.వి.వి.సత్యనారాయణ కవిసంఖ్య:15 శీర్షిక: యశోదతనయ ప్రక్రీయ:పద్యం ఆ.వె: యశోదమ్మబిడ్డ యరుదెంచమనికోర వచ్చియుంటిమమ్మ వలపుతోడ మేళతాళములతొ మేల్కొలుపునుపాడి స్వాగతింతు మేము స్వామివార్ని!! ఇది నా స్వీయ రచన!! [31/12/2024, 6:24 PM] M V Padmavathi: మహతి సాహితీ కవి సంగమం.కరీం నగరం . ధనుర్మాస కవితోత్సవం . 31/12/24 .మంగళ వారం . మైలవరపు వెంకట పద్మావతి. కాకినాడ .18 . శీర్షిక .వృక్ష సంపద .16. ధరణి పై మాను శతాబ్దాల చరిత గలది ఆధునికత పెరిగి మానవుడు అంధుడయ్యే చెట్టు నరికిన ఊపిరాడకుండే జీవితం లో మాను నే ఆసనం గా చేసుకుని కూర్చుని ఆలోచల వలయం లో చిక్కే ... నేల విడిచి సాము చేయ మొక్క నాటే పాడి చేసి నీరు పోసి పెంచగా నిసత్తువ ఆవరించే పాపం ఆలోచన చేయ చెట్టు కొమ్మ నరికిన చిగురించి తరువు పూలు కాయ పండ్లిచ్చు ఆహారంగా నేల మట్టం కే నరికిన చెట్టు చిగురించకా నెలలో వెళ్ళు విలవిల లాడే స్వచ్చ వాయువు నిచ్చి ప్రాణ రక్షణ నిచ్చు చెట్లు నేడు కాన రావే నేలపై దిగులు చెందిన మనిషి మానవతను మరిచే మొక్కలు పచ్చదనం పసిడి కాంతుల మెరుపులు నేలమ్మకు చల్లదనం లో నిలిచిన ఉత్సాహం ఉల్లాసం అహల్లాద వాతావరణం నేర్పరచు చెట్టు .... పశు పక్ష్యాదులు ఆవాసం గా నిలిచి బాటసారులకు విశ్రాంతి నిచ్చు టరువులు కల్ప వృక్షం అని తెలుసుకో మానవా ! వింత పోకడలు తో భోగాలు అనుభవించక విరివిగా నాటు మొక్కలు నేటి మొక్కలే రేపటి వృక్ష సంపద మూర్తీ .... హామీ .స్వీయ రచన [31/12/2024, 7:12 PM] L Vani Sarojini: మహతీ సాహితీ కవిసంగమం ధనుర్మాస కవితోత్సవం 31 12 24 మంగళవారం అంశం ఐఛ్ఛికం పద్యములు తేటగీతి శీర్షిక కార్య శూర హనుమాన్ క్రమ సంఖ్య 24 కవితాసంఖ్య 16 వాణి సరోజిని లక్కరాజు 6ం మదన తాపము దాళక మైధిలిగన దానవేంద్రుడు ‌జొచ్చె నుద్యానవనము రాక్షసాంగనల్ నూర్వురు రాగ వెంట హనుమ మించిన శూరుండు నవని గలడె ? 61 రావణుని గాంచి భయము చే రాజపుత్రి తన తనువును బాహువులలో దాచుకొనుచు దాశరధిని మదిదలచి తరుణివగచె హనుమ మించిన శూరుండు నవని గలడె ? 62 గాలి భీభత్సమై వీయ వాలి పోవు చిగురు టాకును బోలిన సీత జూసి వలచి దెచ్చితి తగదిట్లు వగవ ననెను హనుమ మించిన శూరుండు నవని గలడె ? 63 రాక్షసులకిది ధర్మమౌ రాజనీతి వలపు జూపని మోహంబు వలదు నాకు నన్ను ప్రేమించు మనియంచు సన్నుతించె హనుమ మించిన శూరుండు నవని గలడె ? 64 రాజ్య భోగములను వీడి రాము డిటుల నార వస్త్రములను గట్టి భీరు వగుచు అడవు లన్బట్ట నిన్నెట్లు నాదరించు ? హనుమ మించిన శూరుండు నవని గలడె? 65 పెండ్లి యాడెద నిన్నునే ప్రేమమీర నాదు రాణులు సేవింప నతులజేసి సకల సుఖముల‌ పొందుమో సన్ను తాంగి హనుమ మించిన శూరుండు నవని గలడె ? స్వీయరచన . [31/12/2024, 7:12 PM] +91 94933 13944: *మహతీ సాహితీ కవిసంగమం* *ధనుర్మాస కవితోత్సవం* ఈవారం కవితాసంఖ్య:..16 తేది:....31-12-24.మంగళ వారం శీర్షిక:.....గోదాకళ్యాణం ప్రక్రియ...పద్యం(76-80) కవిపేరు...పద్మ చిగురాల. మహతీ సాహితీ సంఖ్య...21 76. మణులుపొదిగినట్టి మందిరమ్ము మెఱయ ద్వారతోరణముల ధ్వజములలర కృష్ణ దర్శనమ్ము కించిత్తు మరచితి పద్మ పద్యవంద్య వాసుదేవ. 77. గొల్లపిల్లనయ్య నల్లనయ్యనుజూడ ద్వారపాలకులైన వంద్యులార నందగోపబాల మందిరమ్ము దెరువు పద్మ పద్యవంద్య వాసుదేవ. 78. వాద్యపరికరంబు బహుమతి గనుటకు మేల్కొలుపగనిటకు మెల్లగాను శరణు వేడుకొనుచు స్వామినర్థింతుము పద్మ పద్యవంద్య వాసుదేవ. 79. భక్తులెల్లరకును వరదుడౌ పరమాత్మ వైభవముగ పరను వాద్యములను ఇత్తుననుచు మాట నిచ్చినాడాతండు పద్మ పద్యవంద్య వాసుదేవ. 80. దివ్య కాంతిచేత దేదీప్యమానమై కన్నులందునిలుచు కరుణ మూర్తి ఎంత మాయగాడు నెడబాటునోపము పద్మ పద్యవంద్య వాసుదేవ. హామీ పత్రం:స్వీయరచన. [31/12/2024, 7:15 PM] K Padma Sreevasthsav: మహతీ సాహితీ కవిసంగమం ధనుర్మాస కవితోత్సవం-2024 31-12-2024 కవితాసంఖ్య:8 కవి పేరు: కోన.పద్మావతి కవిసంఖ్య:140 శీర్షిక: భక్తి మాలిక ప్రక్రీయ:పద్యం ఆ.వె: గోప బాల రావె గోవిందు సేవకై దాపు లోన కలదు తమ్మి కొలను పూలు కోసి మనము పూజలు చేతము మాపు వేళ ముగిసె! మగువ రావె! వాద్య ములను కోరి వరుణుని ప్రార్థించి వేద వేద్యు చేరి వేడ్క కొలిచి నాద గీత ములతొ నారాయణునిసేవ సుధలు కురియునమ్మ శోభ నాంగి! తెల్ల వారు వేళ తెలియగ లేదేమి? కల్ల నిద్ర పోవ కాదు వేళ! చల్ల గాను లేచి చామంతి రావేమి? గొల్ల బాల నీవు గోప సఖియ! ఇది నా స్వీయ రచన!! [31/12/2024, 7:23 PM] +91 96033 89441: *మహతీ సాహితీ కవిసంగమం* *ధనుర్మాస కవితోత్సవం* కవితాసంఖ్య:..15 తేది:....31-12-24.మంగళ వారం శీర్షిక:.....మార్గశిరం ప్రక్రియ...పద్యం కవిపేరు.జి.లింగేశ్వర శర్మ కవిసంఖ్య 33 66. కం. నూతన వత్సర మందున చేతనముప్పొంగ జేసి చింతలు లేకన్ ప్రీతిగ కొనసాగించగ మా తలపులను నెరవేర్చు మధుసూదనుడా! 67కం ఎన్న డెవరెదురు పడినను మన్ననతో వందన మిడి మాటాడించన్ మిన్నగ భక్తులు జై శ్రీ మన్నారాయణ యనెదరు మధుసూదనుడా! 68. కం వంచించెడు దుష్టుల శి క్షించగ నవతార మొంది క్షితి లోనను ర క్షించియు శిష్టుల నందరి మంచిని గాపాడినారు మధుసూదనుడా! 69. కం. రామావతార మందున క్షేమముగా రాజ్యమేలి శ్రీరాముడిగా! నేమము దప్పక నెన్నడు మా మది స్థిరముగ నిలిచిన మధుసూదనుడా! 70 కం. శ్రీపతి యుపదేశించెను ద్వాపరమున కృష్ణుడిగను భగవద్గీతన్ జూపించగ సన్మార్గము మా పావన గ్రంథమయ్యె మధుసూదనుడా! హామీ పత్రం:స్వీయరచన. [31/12/2024, 7:24 PM] +91 83280 79336: మహతీ సాహితీ కవి సంగమం ధనుర్మాస కవితోత్సవం..2024 31/12/2024,మంగళవారం అంశం.. ఐ చ్చి కం శీర్షిక.. నేను..మా మమతల కోవెల కవిత సంఖ్య..11 కవిసంఖ్య..81 తాతపూడి సోమశేఖర శర్మ =============== నేను నాబాల్యంలో పొందిన ఆనందం నా జీవితంలో అది ఎంతో వర్ణణాతీతం మాఉమ్మడికుటుంబంలో ఎంతఆనందంమో... మర్చిపోలేనిసుందరమ ధురానుభూతియో.. ఆ రోజులు తలచుకుంటే ఎంతో హాయి ఆరోజులుమరలారావాలనిమనసోయి మా తాతగార్కి పదిమంది సంతానము ఐదుగురబ్బాయిలుఐదుగురమ్మాయిలు ఇల్లంతాఎంతకళకళోమనుమలతో ఒకటే సందడే సందడి మనుమరాండ్రతో ఆప్యాయతలు అనురాగాల మాటలు ప్రేమజల్లులు అభిమానపు దొంతరలు మంచి మంచి అందాల హరివిల్లులు మా ఇంటి లోనే ఎక్కువగా సిరిజల్లులు నమ్మవలసిందే ఇప్పటికికూడామరువలేము అప్పుడుతెలిసేదేకాదు ఉమ్మడిఅనేవిషయము వేసవిలోహుషారేహుషారుమామేనత్తలు మామయ్యలుబంధువులు మరదళ్ళు బావలు కోలాహలంతోనిండిపోయేబాబయ్యలపిల్లలు మేము,మాఇల్లుపెద్దవిడిదిలావేసవిచుట్టాలు అమ్మా నాన్నల పంచే ఆప్యాతలతో బాటు పెద్దలవి,మేనత్తలవికూడామాకుఅందుబాటు పిల్లలైన మేము ఎన్ని రకాలైన ఆటలో గంతులేసేవాళ్ళంపాటలతో డాన్సులతో ఒరేయ్చిన్నన్నయ్యా!ఒరేయ్ పెద్దన్నయ్యా! మేనత్తలప్రేమపిలుపుఏమండోయ్ఒదినా! ఈనాటికినాకుచెవులలోమారుమ్రోగుతుంది తర్వాణి అన్నంఅంటేనే నోరుఊరిపోతుంది ఆవకాయతోకలిపిఉల్లిపాయనంజుతోముద్దల నాయనమ్మనోట్లోపెట్టితినిపిస్తుంటేఅమృతమే నాకంటే నాకని చేతులు చాపుకొనేవాళ్ళం వంతులు వేసుకుని ప్రేమలతో తినేవాళ్ళం ఉమ్మడి కుటుంబంలో ఆరోజులే రోజులందం అంత గొప్పదైనదే మా ఉమ్మడి కుటుంబం అందాల హరివిల్లే ఆనందాల మదిజల్లే శాంతియుతంగా ప్రశాంతంగా ప్రేమఝల్లే నేనుఆచిన్నతనంలోసందడంతామరచిపోలేను నేనుఅందంఆప్యాయతబాల్యంలోనేపొందాను మరపురాని మర్చిపోలేని జ్ఞాపకాలు నాకు మామనసుల మమతల ప్రేమ కోవెలలోనే... హామీ పత్రం ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను. [31/12/2024, 7:26 PM] +91 94412 50941: మహతి సాహితీ కవి సంగమం ధనుర్మాస కవితోత్సవం 2024 తేదీ: 31/12/2024(మంగళవారం) కవితా సంఖ్య (15) గాండ్ల నర్సింలు (40) ప్రక్రియ: తేటగీతి పద్యాలు ********************** తే. గీ. (35) అధిక వడ్డికి దెచ్చిరి యప్పులెన్నొ పురుగు మందుల కల్తీతో పురుగుభట్టి పంట నష్టమునొందగా ప్రాణమిడుచు ఆకలార్పును రైతన్న యవనిజనుల!!! తే. గీ. (36) అధిక దిగుబడి కై తాను నవిరలకృషి చేయుచుoడును మిక్కిలి చేవగలిగి రాబడి కొరకు కష్టించు రాత్రిపగలు ఆకలార్పును రైతన్న యవనిజనుల!!! తే. గీ.(37) గుట్టలన్నియు త్రవ్వుచు గుణముతోడ శక్తి కొలదిగా నేలను చదునుచేసి విత్తనములను నాటును,విధివిదముగ ఆకలార్పును రైతన్న యవనిజనుల !!! ఇది నా స్వీయ రచన. [31/12/2024, 7:28 PM] GV Suryanarayana: మహాతీ సాహితీ కవిసంగమం ధనుర్మాస కవితోత్సవం - 2024 31/12/2024 ( మంగళవారం ) అంశం: గీతా ప్రభోధ సారం! శీర్షిక/ప్రక్రియ: కర్మ సన్న్యాస యోగం/(ఇష్టపది-16) కవి: గోపరాజు వెంకట సూర్యనారాయణ (36) @@@@@@@@@@@@@@@ కవిత కర్మ సన్న్యాస యోగం! 1) జ్ఞాన కర్మ యోగము లోన ఫలము లంతే! కర్మా చరణ లేక కర్మ నిర తసాధ్యం!! సాంఖ్య యోగము కన్న సాధన మేలు కర్మ! పరంధామ పధమే కర్మ జ్ఞాన దీక్షలు!! సర్వ జితేంద్రియుడుగ కర్మ యోగ కర్తగ, పరమార్ధ కర్మలను పరమార్పణ చేయుము! తత్పరాయుణుడిగా ధన్య స్థితి నొందుము! యనుచు పరంధామే యర్జునునకు తెలిపెను!! @@@@@@@ ****************************************** హామీ పత్రం: ఈ కవిత నా స్వీయరచన. దేనికీ అనువాదం కానీ, అనుకరణ కానీ కాదని హామీ ఇస్తున్నాను. గోపరాజు వెంకట సూర్యనారాయణ. [31/12/2024, 7:31 PM] G Satyanarayana: మహతి సాహితీ కవి సంగమం ధనుర్మాస కవితోత్సవం-2025 31/12/2024,మంగళవారం అంశం: ఐచ్ఛికం శీర్షిక: ఆండాళ్ తల్లి ప్రవచనం కవిత -9, కవి సంఖ్య:57 ప్రక్రియ: వచనం కవి: గజవెళ్లి సత్యనారాయణ స్వామి **************************** శ్రీగోదా దేవి రచించి పాడిన ఆ సర్వ వేదాంత సారం పాశురాలు పాడి లోకాన్ని తరింప జేయటానికి, దీనిని ఆచరించటానికి అందరికదికారమున్నది. కేవలం ఆచరించాలనే కోరిక మాత్రముంటే చాలును, ఆచరించిన సర్వ ఫలమును అందించు వ్రతమీ వ్రతము. దాన్ని నాచరించే విధానమును సూక్ష్మముగా ఎవరి గృహములలో వారాచరించే విధంగా తగు రీతిలో అదికూడా మరీ అధిక సమయమంటే వీలుపడని ఈనాటి వారికి కూడా అందుబాటులో ఉండేటట్లుగా తగు పుస్తకాలు తయ్యారు చేసి వైష్ణవ ఆచారులు అందింప పూనుకొని భక్తులకు అందిస్తున్నారు. ఇది నా స్వీయ అనుభవ సారం [31/12/2024, 7:33 PM] +91 83907 05200: మహతీ సాహితీ కవిసంగమం ధనుర్మాస కవితోత్సవం-2024 తేదీ: 31-12-2024. శీర్షిక: సర్వమంగళా! కవిత సంఖ్య:16. కవిపేరు:టి. వి. యెల్. గాయత్రి. కవిసంఖ్య:20. ప్రక్రియ :పద్యము (చంపకమాల ) కలుషితమయ్యెసర్వమిట గ్రాలుచు నీధర కాలిపోవగన్ విలవిలమంచు జీవులదె బెగ్గిడు చున్నవి యాశ వీడుచున్ విలసిత మొప్పగన్ గనుచు పృథ్వికి పట్టిన చీడ ద్రోలుమా పులకితమౌగదా ప్రకృతి పొందుచు శాంతిని సర్వమంగళా! [31/12/2024, 7:35 PM] +91 96039 96006: మహాతీ సాహితీ కవిసంగమం ధనుర్మాస కవితోత్సవం తేదీ : 31-12-2024 శీర్షిక : తిరుప్పావై (03) కవిపేరు : శర్వాణి దోర్బల (41) దొంగ నిదుర మానుర దోబూచులు మానుర దాపున నిలిచితిమిర జాగుసేయకుమురా నన్ను నేనే మరచే నా స్వామివి నీవే నా హృదిలో మెదిలే నా కరుణాంత రంగా మల్లెల మాలలతోని మంచి సుగంధము మాలతి విరులల్లినది మగువరో గోదమ్మా కస్తూరి తిలకుడవు కారుణ్య రూపుడవు అయిదవతనమునిల్పు అసురారీ శౌరీ ఇది నా స్వీయ రచన అనీ హామీతో [31/12/2024, 7:39 PM] Ashish Chaithra: మహాతీ సాహితీ కవిసంగమం ధనుర్మాస కవితోత్సవం-2024 తేది:31.12.2024 శీర్షిక:గోదాదేవి గీతిక -16 కవిపేరు.రావుల మాధవీలత ఊరు.హుజురాబాద్ కవిత సంఖ్య.16 క్రమసంఖ్య.45 నాయకుడు మాకైన నంద గోపునియొక్క రాజభవనమునంత రక్షించు వాడవే గోపాలుని కోసము గొల్లవారము మేము ప్రభాత సమయమందు పాడి సుప్రభాతం మేమంత వచ్చితిమి మేల్కొలపస్వామిని వాద్యమివ్వగ మాకు వాగ్దానమిచ్చేను మణి ద్వారము తెరచి మమ్మల్ని పోనిమ్ము మధుసూదనా వినుము మధురమైన గీతిక ఈ ఇష్టపది నా స్వీయరచన అని పూర్తిగా హామీ ఇస్తున్నాను. [31/12/2024, 8:01 PM] +91 97034 83648: మహతీ సాహితీ కవిసంగమం ధనుర్మాస కవితోత్సవం-2024 తేదీ: 31-12-2024 శీర్షిక: *పాలిథీను -16* కవిపేరు: మహేంద్రాడ సింహాచలాచార్య (టెక్కలి) ధనుర్మాస కవి సంఖ్య: 19 *పాలిథీను -16* (పద్య కవిత) 63. గాలి కలుషమగును కాల్చితే జబ్బులే జన్యు లోపమగును జనుల జన్మ విష రసాయనాలు విరివిగా వెలువడన్ ప్రళయ మిలకి దెచ్చుపాలిథీను! 64. నాడి మండలంబు నానాట కృశియించు నదుల యందు జేరి కదులు మురికి యుర్వి గర్భమందు నుదకంబునంతమౌ ప్రళయ మిలకి దెచ్చుపాలిథీను! 65. పంచభూతముల, పర్వతముల యందు వీని వ్యర్ధములవి విడిచివేయ మనల ముట్టడించు మరి జాగు లేకుండ ప్రళయ మిలకి దెచ్చుపాలిథీను! 66. భోగిమంటయందు పులకించు టైర్లవే కాలి కాలి శ్వాస కలుష మొంద బాల వృద్ధ జనుల పాశమై పీడించు ప్రళయ మిలకి దెచ్చుపాలిథీను! 67. వేడుకలవిజరుగ విధిగ ప్లాస్టిక్కదే పిలువకుండ నొచ్చు పెద్దయగుచు మనుజ జీవితమును మౌనంగ పెనవేసి ప్రళయ మిలకి దెచ్చుపాలిథీను! హామీపత్రము: పై *పాలిథీను శతకం - 16(ఆటవెలది పద్యాలు)* స్వీయ రచన [31/12/2024, 8:19 PM] Satyam Mastaru: మహతి సాహితీ కవిసంగమం ధనుర్మాస కవితోత్సవం మంగళవారం 31-12-2024 కృష్ణ లీలలు (రుక్మిణీ కళ్యాణం) ఇష్టపది 1️⃣6️⃣ ముక్కా సత్యనారాయణ 2️⃣8️⃣ శ్రీకృష్ణుని చూసెను సిరిదేవి రుక్మిణీ. సింహమును తలపించు శ్రీకృష్ణు జూసింది. నీలమేఘశ్యాముని, నిలువెల్ల చూసింది. చిరునవ్వు చిలికేటి శ్రీకృష్ణు జూసింది. కృప చూపి కాపాడు కృష్ణుడిని చూసింది. క్రీగంట చూసింది ,కృష్ణుని రుక్మిణమ్మ. కన్య రుక్మిణిని యా కన్నడు జూసినాడు. కమనీయ గాథలను కమ్మగా వినరండి. ఈ రచన నా స్వీయరచన అని తెలియచేస్తున్నాను. [31/12/2024, 10:01 PM] Y Vara Lakshmi: మహతీ సాహితీ కవిసంగమం ధనుర్మాస కవితోత్సవం-2024 తేదీ: 31-12-2204 శీర్షిక: శ్రీరామ శతకం (సీతారామ కళ్యాణం)(16) కవిపేరు: వరలక్ష్మి యనమండ్ర (35) ప్రక్రియ: పద్యం( ఆటవెలది) 76. కౌశికుండు జెప్పె కౌసల్య సుతునకు కదలి వచ్చినట్టి గంగ కథను సగర పుత్రుల కథ సారాంశమును తాను ననుచు రాముని కథ నల్లుచుంటి! 77. అశ్వమును కపిలుని యాశ్రమంబున దాచి తెలియనట్లు నిలిచె దేవరాజు సగర పుత్రులచట జరిగినదెరుగరు ననుచు రాముని కథ నల్లుచుంటి! 78. హయమును గనినంత హాహా యనుచు వారు కపిల మునిని జూచి ఖస్సుమనగ తపము భంగమయ్యి తాపసి మేల్కొనె ననుచు రాముని కథ నల్లుచుంటి! 79. గురువు కండ్ల నుండి క్రోధాగ్ని జ్వాలలు వెలువడి కబళించ వీరలెల్ల భగ్గుమనుచు కాలి భస్మీపటలమైరి యనుచు రాముని కథ నల్లుచుంటి! 80. వార్త తెలిసినంత వరదయ్యె దుఃఖము సగరునకును మరియు సర్వులకును పొర్లి పొర్లి యేడ్చె బూది కుప్పలజూచి యనుచు రాముని కథ నల్లుచుంటి! హామీపత్రము: స్వీయరచన [31/12/2024, 10:16 PM] Sadayya: మహతీ సాహితీ కవిసంగమం ధనుర్మాస కవితోత్సవం-2024 31-12-2024 మేలుకొలుపులు(మత్తకోకిల) కవితా సంఖ్య: (10) డా.అడిగొప్పుల సదయ్య (61) 10. మంచు మాటులు వీగిపోయెను మందసానుడు మీఱగా, పంచవన్నెల రామచిల్కలు పందిరిళ్ళను మూగగా, కంచు గంటలు మోగె గోవెల గంజలోచన! వింటివా? ఎంచ నెవ్వరు నీకు సాటిల? మేలుకో ధరనేలుకో! నిఘంటువు: మాటులు= మరుగు తెరలు మందసానుడు=సూర్యుడు మీఱగా=ఉదయించగా/పుట్టగా కంజలోచనుడు=విష్ణువు ఎంచన్ = లెక్కించగా పై పద్యాలు నా స్వీయరచన అని హామీ ఇస్తున్నాను. అడిగొప్పుల సదయ్య [31/12/2024, 11:04 PM] Porla Venu Gopala Rao: మహతీ సాహితీ కవిసంగమం ధనుర్మాస కవితోత్సవం-2024 తేదీ: 31-12-2204 శీర్షిక: రాఘవేంద్ర శతకం (16) కవిపేరు: పొర్ల వేణుగోపాలరావు(37) ప్రక్రియ: ఆటవెలది (76) ద్వైత మతమునందు వైష్ణవ తత్త్వంపు స్థాయి పెంచెనతడు శ్రద్ధతోడ చక్కబరచెనంట సద్వైష్ణవ మనుచు రాఘవేంద్రుని కథ వ్రాయుచుంటి (77) నామకరణమనగ నామమాత్రము గాదు పేరులోన గలదు పెన్నిధియని తెలియ జెప్పెనతడు దేవుని పేర్లతో రాఘవేంద్రుని కథ వ్రాయుచుంటి (78) పిల్లల మిషతోడ పిలచిన దేవుడు బలుకునంచు దెలిపె పరమ గురువు సత్యపదము దొరకు సంతునామము చాలు రాఘవేంద్రుని కథ వ్రాయుచుంటి (79) మధ్వవరుల బోధ మహిమాన్వితము గాన జ్ఞాన వృద్ధులైరి జనులు నాడు స్మరణ గొప్పతనము చక్కగా వివరించె రాఘవేంద్రుని కథ వ్రాయుచుంటి (80) కలియుగంబులోన కరుణించు దైవము రాఘవేంద్రులనుచు ప్రాకటముగ భక్తవరులు నేడు ప్రార్థింతు రతనిని రాఘవేంద్రుని కథ వ్రాయుచుంటి హామీపత్రము: స్వీయరచన [01/01, 4:39 AM] Vijaya Lakshmi: మహతి సాహితీ కవి సంగమం ధనుర్మాస కవితోత్సవం-2024 తేదీ: 31-12-2024(మంగళవారం) అంశం: గోదా చరితం శీర్షిక:: గడియతీయుమో.. ఘన పాలకులారా ప్రక్రియ: వచన కవిత పేరు: జన్ను ఈశ్వరమ్మ ధనుర్మాస కవి సంఖ్య: 14 కవిత సంఖ్య: 16 ************************* నందగోప భవనమందు వెలసిన సుందరవదన, సురుచిరవాక్పతీ యగు నంద నందనుని సేవకు దయచేసిరి దరహాస వదనులై దశ గోపికా సమేత గోదా సమూహము సంబరముగా మకర తోరణభూషణమై గరుడధ్వజముతో గంభీర నిలయమై మణిమయ భూషిత గడియలు గల సుందర ద్వారములకు కాపుగాయు ద్వారపాలకులారా ఇంద్ర నీలమణి మేని ఛాయగల వాడు ఇహ పరములకధిపతియగు పరంధాముని పిలుపుమేరకే మేమేతెంచితిమయ్యా సుజనులరా ఘన ద్వార పాలకులారా అహంకార మమకారమను తలుపులు ఒక దానితో నొకటి బిగుసుకున్న ద్వారబంధములను మీ స్వ హస్తములతో తొలగించి ప్రభు సన్నిధికి మాకు ద్రోవచూపుమయా వందనములయా కల్లా కపటమెరుగని, గొల్ల పిల్లల మేమంతా నందగోపసుతుని ఆనతిమేరకే అందరము కలిసి వచ్చితి మోయి సందియ మేల నో యి.. మేము గోపకన్నెలమోయి భవ్యమైన"అరై _పరై"యను శ్రావ్య వాద్యమొకటి ఇత్తునని వాసు దేవుడే హామీ ఇచ్చి మము రమ్మనేనోయి సుప్రభాత వేళ సుందర సంకీర్తన సలుపుటకు మేల్కొలుపుల సేవకై మమ్ములను ఆహ్వానించె నోయి ముద్దు కృష్ణుడు వేడుకొందుమయా మిమ్ముల వేగిరమే తలుపులు తెరవండయా వందనములయా జాగేల *************************** *************************** హామీ: స్వీయ రచన

Comments

Popular posts from this blog

Dhanurmasam30-12-2024