Posts

Showing posts from December, 2024

Dhanurmasam 31-12-2024

[31/12/2024, 8:10 AM] Kadali Prakash Rao Prakash: మహాతీ సాహితీ కవి సంగమం ధనుర్మాసకవితోత్సవం 2024. తే 31-12- 2024 ది పాశురము - 16. తిరుప్పావై శీర్షిక : శ్రీదేవి కొలువుకు ప్రక్రియ : ఇష్టపది - 16. కవిపేరు : డాక్టర్. కడలి ప్రకాశరావు కవిసంఖ్య : 8 ఇష్టపది ******** ప్రభవిం lచిన వేకువ ప్రవిమల ప్రభాతమూ గోపికలబృందమూ గోమాత పూజలు శ్రీకృష్ణ దర్శనార్ధం శ్రీదేవికి వ్రతము మామనసులుస్వచ్ఛం మాయ మర్మము లేదు అనిచెప్పినంతనే అన్ని తలుపులు తెరచి స్వాగతించినభటులు సానుకూలము గాను వాణీ నామనసున వర్ణింతు భక్తితో కడలి వారి మాటలు కల్లలు కాదెన్నడును!!! హామీ పత్రం : ఇది నాస్వీయరచన యని హామీ ఇస్తున్నాను. [31/12/2024, 8:29 AM] Bhargavi Peri: మహతీ సాహితీ కవి సంగమం. ప్రతిరోజూ కవితా పండగే. తేదీ : 31-12-24. మంగళవారం. అంశం : ధనుర్మాస వైభవం. శీర్షిక : గోదా పాశురం పద్యాలు. ప్రక్రియ : శార్దూల విక్రీడితం. పేరు : పేరి . భార్గవి. ఊరు : విశాఖపట్నం. కవిత సంఖ్య : 16. క్రమ సంఖ్య : 47. 17. ధర్మాధర్మ వివేకవేద్య ప్రజలన్ ధర్మమ్ముగా నేలి మా కర్మమ్మంతయు రూపు మాప గదవే కారుణ్య ధాము...

Dhanurmasam30-12-2024

*సమీక్షా సారాంశం* *మహతి సాహితీ కవిసంగమం కవి మిత్రులు అందరికీ యశోదమ్మ నమస్సులు. ధనుర్మాస కవితోత్సవం 2024.. ఈనాటి కార్యక్రమానికి మూడు విధాలైన ప్రక్రియలలో తమ అమూల్యమైన రచనలను పంచుకున్న కవి మిత్రులు అందరికీ ధన్యవాదములు మరియు అభినందనలు. ఈనాటి రచనలలో... వచన కవితలు... పద్యాలు... ఇష్టపదులు.. చోటు చేసుకున్నాయి. దాదాపు పక్షం రోజులకు చేరుకున్నాము. పాశురాలను ఇష్టపదులుగా వచన కవితలుగా కవి మిత్రులు చాలామంది రాస్తున్నారు. తొలినాటితో పోల్చితే కవిత్వీకరణ కాస్త మెరుగుపడింది. ఇష్టపదులు సత్యంగారు సూచించిన సూచనలను అనుసరించి సరిచేసుకో గలరు. ఇక పద్య కవులు గురుమూర్తి గారి సూచనలను స్వీకరించగలరు. సమీక్షణం యొక్క ప్రధాన ఉద్దేశ్యం మెరుగైన కవితల ఉత్పాదన మాత్రమే తప్ప వేరే ఎవరినీ నొప్పించేది మాత్రం కాదని గమనించగలరు. నేడు నాకు ఈ సమీక్షణం చేసే అవకాశాన్ని ఇచ్చిన అధ్యక్షుల వారికి... నేటి నిర్వాహకుడు చి. చందుకు సహనిర్వాహకులకు.. సహ సమీక్షకులకు.. కవిమిత్రులందరికీ ధన్యవాదములు. తిరిగి రేపు ఉదయం చక్కని రచనలతో మరల కలుద్దాం. అంతవరకు సెలవు శుభరాత్రి* *మీ* *మహతీ యశోదమ్మ* *శ్రీమతి వరలక్ష్మి యనమండ్ర* ...